చొరబాటు దారులకు ఆధార్‌ కార్డులు.. సుప్రీం ఆందోళన

చొరబాటు దారులకు ఆధార్‌ కార్డులు.. సుప్రీం ఆందోళన

చొరబాటు దారులు ఆధార్‌ కార్డులు పొందటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆధార్‌ కార్డు కలిగిఉన్నంత మాత్రాన ఈ దేశ పౌరుడు కాని వారికి ఓటు హక్కు ఇవ్వాలా? అని సుప్రీం ప్రశ్నించింది. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడానికి మాత్రమే అధార్‌ పనికి వస్తుందని, ఆధార్‌ కార్డు దేశ పౌరసత్వానికి సరైన రుజువు కాదని తెలిపింది. 

పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) నిర్వహించాలనే ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. అధార్‌ చట్టం దేశ పౌరసత్వాన్ని గానీ, నివవాస స్థలాన్ని గానీ ఇవ్వదని బెంచ్‌ స్పష్టం చేసింది.

అలాగే ఓటును హక్కును తొలగించే ముందు నోటీసు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఎవరైనా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు కోసం దరఖాస్తుతోపాటు సమర్పించిన దృవపత్రాల అధారంగా ఓటు హక్కు ఇవ్వాల వద్దా అని నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుందని స్పష్టం చేసింది. ఎలక్షన్‌ కమిషన్‌ పోస్టాఫీసు కాదని పేర్కొంది. 

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ని ప్రత్యేకంగా సవాలు చేస్తున్న ధాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు షెడ్యూల్‌ను కూడా నిర్ణయించింది. డిసెంబర్ 1 లోగా ప్రతిస్పందనలను దాఖలు చేయాలని బెంచ్ ఎన్నికల కమిషన్‌ను కోరింది. పిటిషనర్లు తమ వాదనలను దాఖలు చేయవచ్చని, త్వరలోనే ఈ విషయాలు విచారణకు వస్తాయని తెలిపింది.

ఆధార్ అనేది సంక్షేమ పథకాలను పొందేందుకు రూపొందించిన చట్టబద్ధ పత్రం మాత్రమే. ఒక వ్యక్తికి రేషన్ ఇవ్వడం కోసం ఆధార్ను మంజారు చేసినందుకు, వాళ్లన్ని తప్పసరిగా ఓటరుగా చేయాలా? పక్క దేశానికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడ కార్మికుడిగా పనిచేస్తే, అతడికి కూడా ఓటు హక్కు ఇవ్వాలా? ఓటరు నమోదు ఫారం-6లో పేర్కొన్న వివరాలు సరైనవో, కావో నిర్ధరించుకునే అధికారం ఈసీకి ఉంది” అని ధర్మాసనం పేర్కొంది.