* నాలుగు కార్మిక కోడ్ లతో జర్నలిస్టులకు భారీ ఊరట
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల కారణంగా వర్కింగ్ జర్నలిస్టుల నిర్వచనం మారిపోయిందని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు సంజయ్ కుమార్ ఉపాధ్యాయ తెలిపారు. ఇప్పటిదాకా కేవలం ప్రింట్ మీడియా జర్నలిస్టులు మాత్రమే వర్కింగ్ జర్నలిస్టుల చట్టం కింద ఉన్నారని, ఇప్పుడు టెలివిజన్, రేడియో, డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరూ అధికారికంగా జర్నలిస్టుల సంక్షేమ చట్టం పరిధిలోకి, కార్మిక భద్రతా వలయంలోకి వచ్చారని వెల్లడించారు.
ఈ బృహత్తర నిర్ణయంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా పాత్ర కూడా ఉందని హైదరాబాద్ లో తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ అధ్యక్షుడు రాణా ప్రతాప్ రజ్జూభయ్యా, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ లతోకలిసి హైదరాబాద్ సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో డబ్ల్యూజేఐ దీర్ఘకాల పోరాటం ఫలించిందని పేర్కొన్నారు. ఇది ఒక “చారిత్రక విజయం”గా ఆయన అభివర్ణించారు.
ఇప్పటివరకు “వర్కింగ్ జర్నలిస్ట్” అనే పదం వార్తాపత్రికలు, ప్రింట్ మీడియా, వార్తా సంస్థలకు మాత్రమే పరిమితమని, ఇప్పుడు ఆ నిర్వచనం విస్తరించి మూడు పెద్ద రంగాలైన డిజిటల్ / ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ , టీవీ న్యూస్ & ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో / ఎఫ్‌ఎం / కమ్యూనిటీ రేడియో పాత్రికేయులకూ విస్తరించిందని ఆయన చెప్పారు. దీని ఫలితంగా దేశంలోని అన్ని రకాలన్నీ మీడియాలలో పనిచేస్తున్న పాత్రికేయులు పొందుతారని ఆయన వివరించారు.
వేజ్ కోడ్ ద్వారా కనీస వేతన హక్కు, సకాలంలో, పారదర్శకంగా జీతం చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, బోనస్, అలవెన్సులపై స్పష్టమైన నియమాలు చెబుతూ డిజిటల్ మీడియాలో కాంట్రాక్ట్ / స్ట్రింగర్ / ప్రాజెక్ట్ బేస్డ్ పనిచేసే వారికి ఇది అతిపెద్ద భద్రతా కవచం అని స్పష్టం చేసారు. ఇక సోషల్ సెక్యూరిటీ కోడ్ ద్వారా ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ ఓ, మెటర్నిటీ బెనిఫిట్, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలకు బలమైన అర్హత, అనిశ్చిత ఉద్యోగాలు, అసంఘటిత పని పరిస్థితుల్లో భద్రత, ఫ్రీలాన్స్ & గిగ్ జర్నలిస్టులకూ భద్రతా జాలం సాధ్యమవుతుందని ఉపాధ్యాయ వివరించారు.
ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ కారణంగా ఉద్యోగ నిబంధనల్లో పారదర్శకత, వివాద పరిష్కార విధానం, యాజమాన్య ఇష్టారాజ్యంగా తొలగింపులపై అడ్డు,
పాత్రికేయ యూనియన్ల బలోపేతం, చట్టబద్ధ గుర్తింపు లభిస్తుందని చెప్పారు. వృత్తి పరమైన రక్షణ, ఆరోగ్య, పని వాతావరణం కోడ్ ద్వారా రిపోర్టింగ్ సమయంలో భద్రతా ఏర్పాట్లు, న్యూస్‌రూమ్ & ఫీల్డ్ వర్క్‌లో సురక్షిత వాతావరణం, అతి గంటలు, రిస్క్ కవరేజ్, లైవ్ డ్యూటీలకు స్పష్టమైన ప్రమాణాలు ఏర్పడగలవాని తెలిపారు. టీవీ & డిజిటల్ రిపోర్టర్లకు ఇది అత్యంట ముఖ్యం, ఎందుకంటే ఫీల్డ్ కవరేజ్‌లో ప్రమాదం ఎక్కువ అని గుర్తు చేసారు.
పాత్రికేయ యూనియన్ల బలోపేతం, చట్టబద్ధ గుర్తింపు లభిస్తుందని చెప్పారు. వృత్తి పరమైన రక్షణ, ఆరోగ్య, పని వాతావరణం కోడ్ ద్వారా రిపోర్టింగ్ సమయంలో భద్రతా ఏర్పాట్లు, న్యూస్‌రూమ్ & ఫీల్డ్ వర్క్‌లో సురక్షిత వాతావరణం, అతి గంటలు, రిస్క్ కవరేజ్, లైవ్ డ్యూటీలకు స్పష్టమైన ప్రమాణాలు ఏర్పడగలవాని తెలిపారు. టీవీ & డిజిటల్ రిపోర్టర్లకు ఇది అత్యంట ముఖ్యం, ఎందుకంటే ఫీల్డ్ కవరేజ్‌లో ప్రమాదం ఎక్కువ అని గుర్తు చేసారు.
ఈ చట్టాలు అమల్లోకి రావడానికి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా అనేక సంవత్సరాలుగా ముందస్తు లేఖలు, ధర్నాలు-నిరసనలు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖతో చర్చలు, పార్లమెంటరీ కమిటీలకు సూచనలు, కొత్త కోడ్ డ్రాఫ్ట్‌లపై అభ్యంతరాలు వంటివి చేసిందని ఆయన వివరించారు.
డబ్ల్యూ జే ఐ చారిత్రక పోరాటాల వల్ల పాత్రికేయులకు పలు ప్రయోజనాలు కలగనున్నాయని ఉపాధ్యాయ తెలిపారు. వేతనం & కాంట్రాక్ట్‌లో పారదర్శకత కారణంగా ఛానెల్స్, పోర్టల్స్, ఎఫ్‌ఎం స్టేషన్స్ ఇక ఇష్టారీతిన కాంట్రాక్టులు పెట్టలేవని స్పష్టం చేశారు. ఉద్యోగ భద్రత పెరుగుతుందని చెబుతూ
తొలగింపులు, కోతలు, దోపిడీలకు చట్టబద్ధమైన అడ్డుకట్ట వేయగలవాని చెప్పారు.
తొలగింపులు, కోతలు, దోపిడీలకు చట్టబద్ధమైన అడ్డుకట్ట వేయగలవాని చెప్పారు.
పని గంటలు & సెలవులు నియంత్రణలోకి వస్తాయని పేర్కొంటూ డిజిటల్-టీవీలో 12–14 గంటలు పని సాధారణం; ఇక నియమాలు అమలవుతాయని తెలిపారు. రిస్క్ కవరేజ్‌లో భద్రత లభిస్తుందని పేర్కొంటూ , రాళ్ల దాడులు, విపత్తులు, ఎన్నికలు, క్రైమ్ రిపోర్టింగ్‌లో భద్రతా ప్రమాణాలు వర్తిస్తాయని తెలిపారు. ఈ చట్టాలు అమల్లోకి రావడానికి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా అనేక సంవత్సరాలుగా ముందస్తు లేఖలు, ధర్నాలు-నిరసనలు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖతో చర్చలు, పార్లమెంటరీ కమిటీలకు సూచనలు, కొత్త కోడ్ డ్రాఫ్ట్‌లపై అభ్యంతరాలు వంటివి చేసిందని ఆయన వివరించారు.
కాగా, కొత్త కార్మిక చట్టాలను వర్కింగ్ జర్నలిస్టుల కోణంలో స్వాగతిస్తున్నప్పటికీ పాత్రికేయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ప్రభుత్వ నెరవేర్చాల్సిన బాధ్యతలను మాత్రం ఎత్తిచూపుతామని సంజయ్ కుమార్ ఉపాధ్యాయ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన అక్రిడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించి అర్హులైన అందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలనీ, రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలో హెల్త్ కార్డులను ఆమోదించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనీ ఆయన డిమాండ్ చేశారు.
అలాగే మెట్రో రైళ్లలో జర్నలిస్టులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు జాతీయ, రాష్ట్ర రహదారులపై టోల్ చార్జీలను మినహాయించాలని సంజయ్ కుమార్ ఉపాధ్యాయ కోరారు. కేంద్రం కూడా రైళ్లలో రాయితీని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.

More Stories
విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ‘ముస్లిం బ్రదర్హుడ్’
జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు విలీనం
భూ బకాసురుల రాజ్యంకు హిల్ట్ పాలసీ నిదర్శనం