శతాబ్దాలుగా మార్గం ఏర్పర్చిన గురు తేజ్ బహదూర్ బలిదానం

శతాబ్దాలుగా మార్గం ఏర్పర్చిన గురు తేజ్ బహదూర్ బలిదానం
గురు తేజ్ బహదూర్ జీ మహారాజ్ బలిదానం కేవలం కొన్ని పేరాల్లో వ్రాయబడిన సాహిత్యం కాదని, శతాబ్దాలుగా సమాజానికి మార్గం సుగమం చేసిన సంఘటన అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే తెలిపారు. గురు తేజ్ బహదూర్ 350వ బలిదాన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్ లోని బాటియండాలో జన చేతన నిర్వహించిన సెమినార్‌లో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ, గురు జీ ప్రశంసలు, అపనిందలు, దురాశ, అనుబంధం లేని జీవితాన్ని గడపాలని సందేశాన్ని ఇచ్చారని చెప్పారు. 
 
ఈ సంవత్సరం జబల్‌పూర్‌లో జరిగిన అఖిల్ భారతీయ కార్యకారిణి సమావేశంలో గురుజీ బలిదానం 350వ సంవత్సరం సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఒక ప్రకటన విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. అసహనం చరిత్రను మనం మరచిపోలేమని ఆయన స్పష్టం చేశారు. “మత స్వేచ్ఛపై దాడి చేసే శక్తులు ప్రపంచానికి తీవ్ర సవాలును విసిరాయి. మతం కోసం త్యాగం చేయడం ఈ భూమిపై ఒక సంప్రదాయం. ఒకరి అభిప్రాయాలను ఇతరులపై రుద్దడం భారతదేశ సంప్రదాయం కాదు” అని తెలిపారు. 
 
బాబర్ భారతదేశాన్ని బెదిరించాడని గురునానక్ దేవ్ జీ పేర్కొన్నారని గుర్తు చేస్తూ, అదే రోజున నేడు రామ జన్మభూమి ఆలయంలో జెండా ఎగురవేత కార్యక్రమం జరిగిందని, దీనిని ఒకప్పుడు అదే బాబర్ కూల్చివేసాడని దత్తాత్రేయ తెలిపారు. ఈ అసహనం గురు అర్జున్ దేవ్ జీ బలిదానానికి దారితీసిందని హోసబాలే చెప్పారు.
 
“బాహ్య వైవిధ్యాన్ని చూడవద్దని భారతదేశంలోని ప్రతి సాధువు చెప్పారు. అంతర్గత ఆత్మ ఒకే దేవుని అందమైన భాగం. భారతదేశంలోని అన్ని గొప్ప వ్యక్తులు అన్ని వర్గాలు, మతాలను దేవుడిని చేరుకునే మార్గంగా చూపించారు” అని ఆయన పేర్కొన్నారు. భాయ్ సతీదాస్, భాయ్ మతిదాస్ మరియు భాయ్ దయాళ్ దాస్ బలిదానానికి కూడా ఆయన నివాళులర్పించారు. 
 
హిమాచల్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ పద్మశ్రీ డాక్టర్ హర్మోహిందర్ సింగ్ బేడి మాట్లాడుతూ, గురు తేజ్ బహదూర్ తన కత్తితో యుద్ధభూమిలో తన పరాక్రమాన్ని ప్రదర్శించడం ద్వారా తేజ్ బహదూర్ అనే పేరును సంపాదించుకున్నారని, అయితే ఆయన తన కలం ద్వారా ఉన్నత స్థాయి సాహిత్యాన్ని కూడా సృష్టించారని గుర్తు చేశారు.
 
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌లో 59 శబ్దాలు, 57 శ్లోకాలుగా ఉన్న ఆయన మాటలు ఆధ్యాత్మికత, ధైర్యం, దేవుని పట్ల భక్తి సందేశాన్ని తెలియజేస్తాయని ఆయన తెలిపారు. గురు తేజ్ బహదూర్ బలిదానం ఆసియా దేశాలలో మత మార్పిడుల తరంగాన్ని ఆపిందని ఆయన నొక్కి చెప్పారు. మానవ హక్కులలో మొదటి పాఠం గురు తేజ్ బహదూర్ బలిదానం నుండి నేర్చుకోవాలని, మానవ హక్కులపై ప్రతి పుస్తకంలో ప్రస్తావించాలని స్పష్టం చేశారు.
 
గురు తేజ్ బహదూర్ బలిదానాన్ని గుర్తుంచుకోవడం అంటే భారతదేశం, ఆసియాల 350 సంవత్సరాలను ప్రతిబింబించడం అని ఆయన పేర్కొన్నారు. గురు తేజ్ బహదూర్ బలిదానం కోసం ఢిల్లీకి వెళ్లే మార్గంలో ప్రయాణించిన 50 గ్రామాలలో, ప్రజలు పొగాకు సాగు చేయడం మానేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.
 
గురు తేజ్ బహదూర్ బోధనలను ఆయన సందర్శించిన 150 ప్రదేశాలలో పఠిస్తారు. ఖల్సా సృష్టి సమయంలో, 50,000 మందికి పైగా ప్రజలు ఆనంద్‌పూర్ సాహిబ్‌కు నడిచి వెళ్ళారని ఆయన తెలిపారు. “గురు తేజ్ బహదూర్‌ను మొఘలులు అద్భుతాలు చేసి మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశారు. భాయ్ సతిదాస్, భాయ్ మతిదాస్, భాయ్ దయాల్ లను ఆయన ముందే హింసించగా, వారు అమరులయ్యారని వివరించారు.
 
 దీనిని ప్రశాంతంగా,  నిగ్రహించుకున్న మనస్సుతో చూశారు. ఇంతకంటే గొప్ప అద్భుతం ఇంకేముంటుంది?, అని బేడీ ప్రశ్నించారు.  “గురు గ్రంథ్ సాహిబ్‌లో 40కి పైగా భాషల నుండి శబ్దాలు ఉన్నాయి. గురు తేజ్ బహదూర్ గొప్ప సంగీతకారుడు, ఆయుధాలు, గ్రంథాలు రెండింటిలోనూ నిష్ణాతుడు. ఆయన రాగ జై జైవంతిని ఉపయోగించారు. పఖావాజ్‌ను బాగా వాయించారు. మదన్ మోహన్ మాలవ్య గురు తేజ్ బహదూర్ అన్ని శబ్దాలు, శ్లోకాలను కంఠస్థం చేశారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో కూడా ఆయన ఈ బాణీని పఠించారు” అని ఆయన వివరించారు. 
 
గురు గోవింద్ సింగ్ అనేక అవశేషాలను తమ ఇంట్లో భద్రపరచిన్నట్లు భద్రపరచబడ్డాయని సంత్ బాబా జస్వీర్ సింగ్ (అన్ష్ బన్స్ మై దేశన్) తెలిపారు.ఈ అవశేషాలను అనేక చోట్ల సంగత్ కు చూపించారు. మనమందరం ఒకే దేవుని భాగాలమే, ఇది గురునానక్ సందేశం. గురునానక్ సందేశం ఒకటి, రెండు కాదు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను అనుభవించడం” అని చెప్పారు.