గత తొమ్మిది సంవత్సరాలుగా సేవా భారతి ఆధ్వర్యంలో కిశోరీ బాలికల విద్య, ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధి, మహిళా సాధికారతపై అవగాహన కల్పించేందుకు సేవాభారతి నిర్వహిస్తున్న ‘రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్’ కార్యక్రమం 10వ ఎడిషన్‌గా 2026 మార్చి 1వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది.
ఈ సందర్బంగా, కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ పాల్టెక్ టెక్నాలజీస్ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రీడమ్ ఆయిల్ ప్రతినిధి చేతన్, పాల్టెక్ ప్రతినిధి శ్రీమతి శాంతి, సేవా భారతి వాలంటీర్లు పాల్గొని, పోస్టర్‌ను ఆవిష్కరించారు.
సేవా భారతి తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా మహిళా సాధికారత, కిశోరీ బాలికల సమగ్ర వికాసం కోసం పలు సేవా కార్యక్రమాలు, ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తోంది. వాటిలో జిడిఏ (నర్సింగ్ అసిస్టెంట్) శిక్షణ, కుట్లు, అల్లికలు, మగ్గం, బ్యూటిషన్ కోర్సులు, కంప్యూటర్ ట్రైనింగ్, స్వావలంబన శిక్షణ, సుపోషణ, మెరుగైన ఆరోగ్య అవగాహన, చికిత్స కార్యక్రమాలు, పాఠశాలలు , ట్యూషన్ సెంటర్లు ముఖ్యమైనవి.
ఈ సందర్భంగా చేతన్ మాట్లాడుతూ సేవా భారతి వంటి సేవా సంస్ధతో అనుబంధం ఎంతో విలువైనదని, సామాజిక సేవలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని తెలిపారు. శ్రీమతి శాంతి సేవా భారతి ‘కిశోరీ వికాస్’ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కిశోరీ బాలికల జీవితాలలో చోటుచేసుకున్న సానుకూల మార్పులను వివరించారు.

More Stories
కేశవ నిలయంలో “పంచ పరివర్తన్”పై ఏఐలో కార్యశాల
తెలంగాణాలో మంత్రులు సహా వందల వాట్సాప్ గ్రూపుల హ్యాక్
రిజర్వేషన్ జీవోకు మళ్లీ న్యాయ చిక్కులు తప్పవా?