అలాగే నకిలీ పత్రాలను సమర్పించి సిమ్ కార్డులను కొనుగోలు చేయడం, మీ పేరుమీద కొనుగోలు చేసిన సిమ్‌కార్డులను వేరొకరికి ఇవ్వడం నేరమని తెలిపింది. సైబర్ నేరాలు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు మీ సిమ్‌కార్డు వినియోగించినట్లు తేలితే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రకారం మొబైల్స్ సహా ఇతర డివైజ్‌లలో ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) ని ట్యాంపర్ చేస్తే మూడేళ్ల వరకు జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంటుందని డాట్ తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ రూల్స్, 2024 ప్రకారం ఐఎంఈఐ మార్పు చేసిన డివైజ్‌లను వాడడం నిషేధమని డాట్ గుర్తుచేసింది.
సంచార్ సాథి మొబైల్ యాప్‌లో ఐఎంఈఐ వివరాలను తనిఖీ చేసుకోవాలని పౌరులకు డాట్ సూచించింది. ఐఎంఈఐ వివరాలు ఎంటర్ చేస్తే బ్రాండ్ నేమ్, మోడల్, తయారీ వివరాలు దర్శమిస్తాయని తెలిపింది. టెలికాం వనరుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, పౌరులందరికీ సురక్షితమైన టెలికమ్యూనికేషన్ సేవలను అందించడం కోసం ప్రభుత్వం కఠిన ఏర్పాట్లు చేసిందని పేర్కొంది.

More Stories
సరుకు రవాణలో రైల్వేలు నూతన మైలురాయి
ఇకపై నమో భారత్ రైళ్లలో పుట్టినరోజులు, పెళ్లిరోజులు
విద్యార్థుల కోసం ‘జెన్-జెడ్’ పోస్టాఫీస్‌లు