కేశవ స్మృతి సంవర్ధన సమితి ద్వారా నిర్వహిస్తున్న అనేక సేవాకార్యక్రమాలలో భాగంగా కుత్రిమ మేధ (ఏఐ) తరగతులను ఆరు వారాలపాటు నిర్వహించారు. కేశవ నిలయంలో జరిగి కార్యక్రమంలో ఏఐలో శిక్షణ పొందిన 30 మందిని ఐదు జట్లుగా విభజించి “పంచ పరివర్తన్”పై కార్యశాల నిర్వహించారు. ఏ ఐ ని ఉపయోగించి ఐదు విషయాలను ఒక్కొక్క జట్టుకు విభజించి వాటిని వారు పూర్తిగా చర్చించి ఒక పెద్ద షీట్ లో పొందుపరిచిన తర్వాత ఒక్కొక్క జట్టు వారు చేసిన విషయాలను వివరించారు.
మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్, సీనియర్ డైరెక్టర్ సురేంద్ర తిప్పరాజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన కార్యక్రమంలో పంచ పరివర్తనలో ప్రతి విషయాన్నీ వారు చర్చించి, అద్భుతమైన రీతిలో వివరించిన తీరు అందరిని ఆశ్చర్యం పరిచింది. వాటిని ఆచరించాల్సిన అవసరాన్ని ఆసక్తిదాయకంగా వివరించారు.
అనేక సామాజిక, ఆర్థిక ,ఆధ్యాత్మిక విషయాలను వారు ఇందులో జోడించారు.
ఏ ఐ లో శిక్షణ పొందిన విద్యార్థులందరూ ఈ కార్యశాల తమ కెరీర్ లో చాలా ఉపయోగపడుతుందని సంతోషం తెలియజేశారు. ఆసక్తిదాయకంగా ఏఐ శిక్షణ ఇచ్చిన కోఆర్డినేటర్ రవి రేవెల్లి, శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కేశవ ప్రకాష్ గండ్లూరి, సమితి కోశాధికారి రామచందర్, సమితి సభ్యులు సాయి ప్రసాద్, పరమేశ్వర్ లు పాల్గొన్నారు.
సమితి ప్రధాన కార్యదర్శి కొప్పరపు బాలయ్య ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ సంఘ్ సంస్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ కేశవ బలి రామ్ హెడ్గేవార్ యుగదృష్టగా సమాజానికి అందించిన శాఖ కార్యక్రమం, వ్యక్తి, దేశభక్తి అవసరం, పంచపరివర్తన్ విశిష్టత ఆవశ్యకత వివరించారు.శిక్షణ పూర్తి చేసిన 30 మందికి సమితి ద్వారా ప్రశంస పత్రాలు ప్రముఖుల ద్వారా ఇప్పించారు.

More Stories
తెలంగాణాలో మంత్రులు సహా వందల వాట్సాప్ గ్రూపుల హ్యాక్
రిజర్వేషన్ జీవోకు మళ్లీ న్యాయ చిక్కులు తప్పవా?
తెలంగాణలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు