ఆదివారం జరిగిన ఫైనల్లో నేపాల్‌ను ఢీ కొట్టిన భారత మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 115 పరుగుల లక్ష్యాన్ని టీమ్ండియా 12 ఓవర్లలోనే మూడే వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫూలా సరెన్ (44 పరుగులు, 27 బంతుల్లో) అదరగొట్టింది. అనంతరం ఛేదనలో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్ ఫులా సరేన్ (44) మెరుపులతో పది ఓవర్లకే స్కోర్ వంద దాటింది.
మరో మూడు ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్న భారత్ 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఆరంభం నుంచి తొలిసీజన్ ఛాంపియన్‌గా రికార్డు నెలకొల్పింది. ధనాధన్ ఆటతో జట్టు విజయంలో కీలకమైన ఫులా సరేన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన నేపాల్ మహిళల జట్టు 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ సునాయసంగానే ఛేదించి ఛాంపియన్‌గా నిలిచింది. కాగా, ఈ టోర్నమెంట్‌ను తొలిసారి నిర్వహించారు. ఇందులో భారత్‌తోపాటు పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, యూఏఈ జట్లు పాల్గొన్నాయి.
ఈ టీమ్‌లో ఇద్దరు తెలుగమ్మాయిలు కీలకంగా వ్యవహరించారు. వారిలో ఒకరు టీమ్ కెప్టెన్ దీపిక, మరొకరు కరుణ కుమారి. అన్ని మ్యాచ్‌లలో వీరిద్దరు అదరగొట్టారు. దీపకది ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంబాలహట్టి గ్రామం.. తల్లిదండ్రులు చిక్కతిమ్మప్ప, చిత్తమ్మ వ్యవసాయ కూలీలు. ఆమెకు ఐదు నెలల వయసులో గోరు తగలడంతో కంటి చూపును కోల్పోయింది. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు గ్రామం కావడంతో దీపిక కర్ణాటకలో విద్యనభ్యసించింది. నాలుగో తరగతి వరకు స్థానికంగా ఉన్న స్కూల్లో చదివింది.

More Stories
10 వేల ఏళ్ల తర్వాత పేలిన ఇథియోపియాలోనిఅగ్నిపర్వతం
షాంఘైలో భారత మహిళకు వేధింపులు
మాటలకే పరిమితమైన వాతావరణ సదస్సు