స్టేషన్లలో నిలిపి ఉంచిన బోగీలనుగానీ, లేదంటే కదులుతున్న నమో భారత్ రైలు బోగీలనుగానీ వినియోగదారులు అద్దెకు తీసుకోవచ్చు. వేడుకల కోసం దుహాయ్ డిపో వద్ద ఒక నమూనా బోగీని అలంకరించి ఎప్పుడూ అందుబాటులో ఉంచుతారు. బోగీలకు బుకింగ్ చార్జీలను గంటకు రూ.5,000గా నిర్ణయించారు.
వేడుకకు అవసరమైన డెకరేషన్ సామాగ్రి సెట్ చేసుకునేందుకు మరో 30 నిమిషాల సమయం అదనంగా ఇస్తారు. అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య మాత్రమే వేడుకలకు అనుమతి ఉంటుంది. వేడుకలు జరుపుకునే వారు సాధారణ రైలు కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా, ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ వేడుకలు ఎన్ సి ఆర్ టి సి ఉద్యోగులు, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఢిల్లీ-మేరఠ్ కారిడార్‌లోని ఆనంద్ విహార్, ఘజియాబాద్, మేరఠ్ సౌత్ స్టేషన్లలో ఈ సౌకర్యం చాలామందిని ఆకర్షిస్తుందని ఆశిస్తున్నారు. అంతేగాక సినిమా షూట్లు, డాక్యుమెంటరీలు, ప్రకటనలు ఇంకా ఇతర విజువల్ ప్రాజెక్ట్‌ల కోసం నమో భారత్ రైళ్లు, స్టేషన్లను అద్దెకు తీసుకునేందుకు ఎన్ సి ఆర్ టి సి మరో విధానాన్ని కూడా రూపొందించింది.

More Stories
సిద్ధంగా ఐదు తేజస్ మార్క్1-ఏ ఫైటర్ విమానాలు
అమెరికా ఒప్పందంలో వ్యవసాయ, పాడి రంగాలకు పూర్తి రక్షణ
దేశీయ ఐటీ దిగ్గజాల షేర్లు 6 శాతం పతనం