“పాకిస్థాన్కు చైనా జలాంతర్గాములు, నౌకలను సరఫరా చేస్తోందని మాకు తెలుసు. మేము ప్రతిదీ నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. దాయాది దేశం పాక్కు త్వరలో డ్రాగన్ జలాంతర్గాములను వస్తుంది. కానీ మేము ఆ ప్రాంతంలోని అన్ని పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. మేం ఏం చేయాలో చేస్తున్నాం. జలాంతర్గామి వ్యతిరేక యుద్ధానికి భారత్కు ఎలాంటి సామర్థ్యాలు అవసరమో కూడా మాకు తెలుసు.” అని నేవీ వైస్ చీఫ్ సంజయ్ వాత్సాయన్ వ్యాఖ్యానించారు.
నవంబర్ 25-26 వరకు దేశ రాజధాని డిల్లీలోని మాంక్ షా సెంటర్లో భారత నేవీ స్వావలంబన్ 2025 జరగనుంది. ఈ కర్టెన్ రైజర్ ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజయ్ వాత్సాయన్ పాక్ నేవీకి చైనా చేస్తున్న సాయాన్ని వెల్లడించారు.
“చైనా తమ దేశ అమ్ములపొదిలో మూడో విమాన వాహక నౌకను చేర్చుకోబోతోంది. అయితే రాబోయే రెండేళ్లలో భారత నేవీ అమ్ములపొదిలో కూడా బహుళ విమాన వాహన నౌక విమానాలు చేరబోతున్నాయి. అవి నిర్మాణ దశలో ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో డెలివరీ అవుతాయి. గత ఐదేళ్లలో భారత నేవీ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంది” అని స్పష్టం చేశారు.
ఇండియన్ నేవీ ఇతర దేశాల సైనిక సామర్థ్యాలు, సాంకేతికతలను పర్యవేక్షిస్తోందని, తదనుగుణంగా అటువంటి సాంకేతికతను ఎదుర్కోవడానికి అందుకనుగుణంగా నేవీ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటుదని తెలిపారు. నిరంతరం హిందూ మహాసముద్రంలో 40- 50 నౌకలు తిరుగున్నాయని ఆయన ఈ మధ్యనే పేర్కొనడం గమనార్హం.

More Stories
పార్లమెంట్లో 14 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
పరిశోధనారంగంలో దూసుకుపోతున్న భారత్
గిరిజనులు గుర్తింపు, ఉనికి రెండింటినీ పరిరక్షించుకోవాలి!