అమెరికా విదేశాంగ శాఖ ఈ అమ్మకానికి ఆమోదం తెలిపిందని, ఇందులో 45.7 మిలియన్ డాలర్ల విలువైన జావెలిన్ వ్యవస్థలు, 47.1 మిలియన్ డాలర్ల విలువైన ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్ ఉన్నాయని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (
డీఎస్‌సీఏ) వెల్లడించింది. భారత్ మొత్తం 100 ఎఫ్ జి ఎం-148 జావెలిన్ క్షిపణులు, 25 కమాండ్ లాంచ్ యూనిట్లు, 216 ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్ కోసం అభ్యర్థించినట్లు తెలిపింది.“ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది. మా కీలక రక్షణ భాగస్వామి అయిన భారత్ భద్రతను మెరుగుపరచడం ద్వారా ఇండో-పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయ స్థిరత్వం, శాంతి, ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది” అని డీఎస్‌సీఏ పేర్కొంది. ఈ ఒప్పందంతో భారత్ తన దేశీయ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకోగలదని వివరించింది.
కొన్ని వారాల క్రితమే వాషింగ్టన్, న్యూఢిల్లీ మధ్య పదేళ్ల రక్షణ సహకార ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ విక్రయానికి ఆమోదం లభించడం గమనార్హం. అక్టోబర్ 31న కౌలాలంపూర్‌లో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య రక్షణ భాగస్వామ్యంలో నూతన శకానికి నాంది పలుకుతుందని అప్పట్లో రాజ్‌నాథ్ సింగ్ పేర్కొనగా, భారత్-అమెరికా రక్షణ సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయని హెగ్సెత్ అభిప్రాయపడ్డారు.
More Stories
13 రోజుల పాటు ఈడీ కస్టడీలో అల్ ఫలాహ గ్రూపు చైర్మెన్
పాకిస్తాన్ వ్యవస్థాగత లోపాలపై ప్రపంచ బ్యాంకు హెచ్చరిక
దావూద్ ఇబ్రహీం డ్రగ్స్ పార్టీలో బాలీవుడ్ తారలు