ఈ- కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతిలిచ్చారు. ఆయనను ఏసీబీ విచారించేందుకు అనుమతులు మంజూరు చేశారు. ఇప్పటికే ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌లో 4 సార్లు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. రూ.54.88 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ ఈ విచారణ జరుపుతోంది. ఈ కేసులో కేటీఆర్ పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయంటూ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వలాంటూ గవర్నర్‌ను ఏసీబీ అనుమతి కోరింది.
దానిని పరిశీలించిన గవర్నర్ తాజాగా కేటీఆర్ విచారణకు అనుమతి జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలో కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున్న ఆయనపై చర్యలకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సానుకూలంగా స్పందించారు.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై 2022 అక్టోబరు 25న ఒప్పందం కుదిరింది. ఫార్ములా-ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్ట్స్ జెన్, పురపాలక శాఖలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్‌లు హైదరాబాద్‌లో నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్‌లో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహించారు.
తదుపరి ఏడాది 10 వ సీజన్ నుంచి ఏస్ నెక్ట్స్‌జెన్ అకస్మాత్తుగా తప్పుకుంది. దాంతో ప్రమోటర్‌గా హైదరాబాద్ మెట్రో డెవలప్మెట్ అథారిటీ (హెచ్ఎండీఏ)నే పోషించాలని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో 2023 అక్టోబరు 54.88 కోట్లను ఫార్ములా-ఈ ఆపరేషన్స్ సంస్థకు హెచ్ఎండీఏ నేరుగా బదిలీ చేసింది. ఈ వ్యవహారమే ఇప్పుడు ఈ మొత్తం వివాదానికి తెరలేపింది.
హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థికశాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే ఈ చెల్లింపులు జరిగాయి. వీటిలోనూ రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. ఈ మేరకు ఏసీబీ విచారణ జరిపింది. ఈ చెల్లింపులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీ గత ఏడాది డిసెంబర్లో విచారణ ప్రారంభించింది. రేసింగ్‌లో అవకతవకలపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఇందులో ఏ1గా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది. ఇందులో కేటీఆర్‌ను ఏసీబీ ఇప్పటివరకు 2 సార్లు నోటీసులు జారీచేసి విచారించింది.

More Stories
డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా
మావోయిస్టులు అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మవద్దు!
నల్లగొండలో రైతు దీక్షను విరమింపచేసిన ఏలేటి