బీసీ, ఎస్సీ, ఎస్టీలపై రాహుల్ గాంధీ భయంకర కుట్రలు!

బీసీ, ఎస్సీ, ఎస్టీలపై రాహుల్ గాంధీ భయంకర కుట్రలు!
ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు
“పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజల్ని ఎదగనివ్వకూడదు. ఎదిగితే ఎదురుతిరుగుతారు. పరిపాలనలో లేనప్పుడు ఎదుగలేకపోయారు అని రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి” ఈ సింపుల్ లాజిక్‌తో దేశాన్ని ఏడు దశాబ్దాలుగా నాశనం చేస్తూ వచ్చిన  నెహ్రూ పరివారం ఇప్పుడు కూడా మారలేదు. దేశమంటే తమ ఆస్తి అని అనుకునే ఆ పరివారంలో తెలివి మీరిన వారసుడు రాహుల్ గాంధీ తమ పూర్వీకులు చేసిన కుట్రల్నే దేశంపై చేస్తున్నారు.

అధికారం లేదు కాబట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కులాన్ని ఎంచుకున్నారు. ప్రజల్లో ఎలా చిచ్చు పెట్టారో నెహ్రూ పరివారానికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న రాజకీయం చూస్తే ఆయన పప్పు కాదు.. ప్రజల మధ్య చిచ్చు పెట్టే నిప్పు అని అర్థం చేసుకోవచ్చు.

బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన  సైన్యానికి, న్యాయవ్యవస్థకు కులాన్ని అంట కట్టేశారు. పది శాతం జనాభా ఉన్న కులాలే ఆయా వ్యవస్థల్ని నడిపిస్తున్నాయని, బడుగు, బలహీనవర్గాలకు అవకాశం రాలేదని మొసలి కన్నీళ్లు కార్చారు. అదే నిజం అయితే ముందుగా ఆ బడుగు, బలహీనవర్గాలన్నీ కలిసి నిర్దాక్షిణ్యంంగా శిక్షించాల్సింది రాహుల్ తో సహా నెహ్రూ పరివారాన్నే. ఎందుకంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్పినప్పటి నుండి రెండు తరాల పాటు వారే పరిపాలించారు.

బ్రిటిష్ వాళ్లు స్వాతంత్ర్యం ప్రకటించి వెళ్లిపోయాక.. దేశ ప్రజలందర్నీ సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరంగా ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఎదగకుండా చేసి ఎప్పటికీ వారిని ఆశల పల్లకీలో ఉంచి ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. ఫలితంగా వారు ఏడు దశాబ్దాల తర్వాత కూడా వెనుకబడే ఉన్నారు. ఇప్పుడు ఆ వెనుకబాటునే చూపించి రాహుల్ గాంధీ మరోసారి వారిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారు.

భారతదేశ స్వాతంత్ర్యానంతర రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి 2014 వరకు (సుమారు 60 ఏళ్లు) కేంద్రంలో అధికారంలో ఉండి, విధానాలు, చట్టాలు రూపొందించింది. ఈ కాలంలో బీసీలు (బ్యాక్‌వర్డ్ కులాలు), ఎస్సీలు (షెడ్యూల్డ్ కులాలు), ఎస్టీలు (షెడ్యూల్డ్ ట్రైబ్స్), ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీలు) ప్రగతి సాధించలేకపోవడం  కాంగ్రెస్ పార్టీ పాలనా కుట్రలకు నిదర్శనం.  రిజర్వేషన్లు, విద్యా అవకాశాలు, ఉద్యోగాలు అందించినప్పటికీ, ఈ వర్గాలు సామాజిక-ఆర్థికంగా ముందడుగు వేయలేకపోవడానికి కారణాలు కాంగ్రెస్ పార్టీ చేతకానితనం, వారు ఎదుగకూడదన్న కుట్ర మాత్మరే.

అమలు లోపాలు, ఎలైట్ క్యాప్చర్, ఆర్థిక విధానాల బయాస్ ఎక్కువగా జరిగాయి.  కాంగ్రెస్ పాలనలో డా.బి.ఆర్. అంబేడ్కర్ (1950లో మొదటి చట్టం) ప్రభావంతో ఎస్సీ/ఎస్టీలకు 22.5% రిజర్వేషన్లు (ఉద్యోగాలు, విద్య) అమలు చేశారు. 1990లో మండల్ కమిషన్ (ఓబిసిలకు 27%)ను వీపీ సింగ్ (కాంగ్రెస్ మద్దతు) అమలు చేశారు. కానీ,  కాంగ్రెస్ అధికారంలో ఉన్న 60 ఏళ్లలో ఈ  వర్గాల స్థితిగతులు పెద్దగా మారేదు.

రిజర్వేషన్లు  ఇచ్చినా అమలు లోపాలు కారణంగా  ఆయావర్గాలు సరైన ఫలితాలు అందుకోలేదు.  1980ల్లో ఇంజినీరింగ్ కాలేజీల్లో ఓబిసి సీట్లు 50% ఫిల్ అయ్యేవి కావు. ఎందుకంటే   ఎందుకంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లోపం వల్ల.. ఆయా వర్గాలు ఇంజినీరింగ్ వరకూ రాలేకపోయాయి.   గ్రామీణ ఓబిసి/ఎస్సీలు 40% డ్రాప్‌ఔట్ రేట్ ఉండేది.  అదే సమయంలో  కాంగ్రెస్ లీడర్‌షిప్‌లో  అగ్రవర్ణాల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది.

నెహ్రూ, ఇందిరా ఎరా హయాంలో 1970ల్లో ఎస్సీలకు మంత్రి పోస్టులు 5% మాత్రమే.  “కాంగ్రెస్ రిజర్వేషన్లను ‘టోకెన్’గా ఉపయోగించింది, అసలు సామాజిక మార్పు రాలేదు అనేది అందరూ అంగీకరించే నిజం.  కాంగ్రెస్ పాలనలో ఆర్ టి ఈ (2009) వంటి చట్టాలు వచ్చాయి, కానీ బీసీ/ఎస్సీ/ఎస్టీలకు సమాన విద్య  అందులేదు.   1991 సంస్కరణల తర్వాత, ఆర్థిక వృద్ధి అర్బన్ ఎలైట్‌కు మాత్రమే సాధ్యమయింది.  2015లో ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎస్సీ/ఎస్టీలు జిడిపిలో 8% కాంట్రిబ్యూషన్ మాత్రమే ఇస్తున్నారు. వారి  జనాభా 25% .
 
భూసంస్కరణలు అమలు చేయడంలో కాంగ్రెస్ నిర్లక్ష్యమే దీనికి కారణం అని తేల్చారు.  ఇవన్నీ కాంగ్రెస్ కు తెలియక కాదు.. అన్నీ తెలుసు. “ కాంగ్రెస్ ‘సామాజిక న్యాయం’ చెప్పి, కార్పొరేట్ లాబీలకు మొగ్గు చూపిందని రాహుల్ గాంధీ గత ఏడాది స్వయంగా ఒప్పుకున్నారు. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్‌కి రాజ్యాంగ హోదా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదు. 1993లో  పి.వి. నరసింహా రావు ప్రయత్నం చేసిన సమయంలో అనేకమంది కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు.  ఈ విషయాన్ని పీవీనే ఓ సందర్భంలో పరోక్షంగా చెప్పారు. 

2004 నుండి 2014 మద్య కాలంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రాహుల్ రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారు. ఏకంగా తమ స్వంత ప్రభుత్వం  కేంద్ర కేబినెట్ నిర్ణయాలను మీడియా సమావేశంలో చించివేసి, చెత్త బుట్టలో వేసిన అధికారం చెలాయించారు.   బహుజన్ సమాజ్ వంటి పార్టీలు కాంగ్రెస్ రిజర్వేషన్లను కృతకంగా అమలు చేసింది, రియల్ పవర్ షేర్ చేయలేదని ఎన్నో సార్లు స్పష్టంగా చెప్పాయి. అంటే ఇక్కడ అందరికీ కాంగ్రెస్ చేసిన పాపం గురించి అవగాహన ఉంది.  బడుగు వర్గాలు ఎదిగితే తమకు ఓట్లు వేయరన్నకారణంగానే వారిని ఎదుగనియలేదు

కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలందర్నీ సమానంగా అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంది. 70 ఏళ్ల పాటు సాగిన వివక్షను తొలగించి.. అందర్నీ సమాన స్థాయికి తీసుకు రావడానికి ఓ యజ్ఞమే చేస్తోంది. ఈ రోజు చీఫ్ జస్టిస్ స్థాయికి దళిత బహుజనుడు ఎదిగారంటే దానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.   2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ (షెడ్యూల్డ్ కులాలు), ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్స్), బీసీ (బ్యాక్‌వర్డ్ కులాలు) వర్గాల అభివృద్ధి వేగవంతమైంది. ఈ విషయాన్ని  అధికారిక డేటానే నిరూపిస్తోంది.

మోదీ ప్రభుత్వం ఈడబ్ల్యుఎస్ (ఎకానమిక్ వీకర్ సెక్షన్) 10% రిజర్వేషన్, ఎస్సి/ఎస్టీ సబ్-ప్లాన్ అమలు, పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కాలర్‌షిప్స్ వంటి చర్యలతో ఈ వర్గాల లిటరసీ రేటు 10-15% పెరిగింది, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం 20%కి చేరింది. ఎన్ఎస్ఎస్ఓ  2023 రిపోర్ట్ ప్రకారం, ఈ వర్గాలు జిడిపిలో కాంట్రిబ్యూషన్ 12%కి పెరిగింది (2014లో 8%).  సుప్రీమ్ కోర్టు జడ్జిల్లో 4/34 (12%) ఎస్సి/ఎసి, ఐఏఎస్ లో ఓబిసి 18%, ఎస్సి 15%, ఎస్టీ 6% – మొత్తం 39% ప్రాతినిధ్యం లఙిస్తోంది.   ఈ ప్రగతి ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ అజెండాతో జరిగింది.  నీతి ఆయోగ్  2024 రిపోర్ట్ ప్రకారం 2014-24 మధ్య ఈ వర్గాలు 2.5 కోట్ల పీఎం ఆవాస్ ఇళ్లు  , 10 కోట్ల ఉజ్వల  కనెక్షన్లు పొందారు. ఆయా వర్గాల్లో  ఆర్థిక అభివృద్ధి 8.5% పెరిగింది.

బీజేపీ పాలనలో ఎస్సి/ఎస్టీ/ఓబిసిలకు రిజర్వేషన్ల అమలు మెరుగుపడింది. డిఓపిటి 2023లో ఉద్యోగాల్లో ఎస్సి/ఎస్టీ ఫిల్ రేట్ 85% శాతంగా ఉన్నట్లుగా ప్రకటించారు.  2014లో ఇది 70% శాతమే.  విద్యలో పీఎం విద్యా లక్ష్య్, 6,000 పీఎం శ్రీ విద్యాలయాలు – ఏఎస్ఈఆర్ 2024: ఎస్సి/ఎస్టీ లిటరసీ 72% (2014లో 62%), ఓబిసి 78% (68%). ఆర్థికంగా, జన్ ధన్ యోజన (50 కోట్ల అకౌంట్లు, 70% ఎస్సి/ఎస్టీ/ఓబిసి), ముద్రా లోన్‌లు (60% ఈ వర్గాలకు) ఇచ్చారు.

ఆర్బీఐ 2024లో ఇచ్చిన రిపోర్టు ప్రకాకరం  ఈ వర్గాలు ఎంఎస్ఏంఈలలో 45%  లబ్ది పొందుతున్నాయి.  2014లో ఇది 30% మాత్రమే.  2014-24 మధ్య ఈ వర్గాలు 15 మిలియన్ ఉద్యోగాలు పొందారని..   పేదరికం 25% నుంచి 12%కి తగ్గిందని నీతి ఆయోగ్ స్పష్టంగా తెలిపింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన 102వ రాజ్యాంగ సవరణ చట్టం, 2018 ద్వారా జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ (ఎన్ సిబిసి) కి రాజ్యాంగ హోదా కల్పించడం భారత ప్రజాస్వామ్యంలో చారిత్రాత్మక అడుగుగా నిలిచింది.

ఈ సవరణతో ఆర్టికల్ 338బి కింద ఎన్ సిబిసి ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా రూపుదిద్దుకుంది. ఇది వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధి కోసం పర్యవేక్షణ, సలహా, మరియు రక్షణ బాధ్యతలను నిర్వర్తించనుంది. ఈ నిర్ణయం భారతదేశంలో సమానత్వం, న్యాయం, సమగ్ర అభివృద్ధి పట్ల మోదీ ప్రభుత్వ కట్టుబాటును ప్రతిబింబిస్తుంది. వెనుకబడిన వర్గాల సాధికారత దిశగా ఇది ఒక శాశ్వతమైన మార్పు.

ఈ వివరాలను విశ్లేషించుకుంటే ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుగుతున్నాయి. పదేళ్లలోనే  అనితర సాధ్యంగా వారి వృద్ధి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ల పాటు వారిని పునాదుల నుంచి బలపరిచే అవకాశం వచ్చినా పట్టించుకోకుండా.. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తొక్కిపెట్టింది. ఇప్పుడు వారిని బీజేపీ పైకి తీసుకు వస్తూంటే.. కులగణన పేరుతో రెచ్చగొట్టి వారిని మరోసారి ఎదగకుండా చేసేందుకు చేసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు.

సైన్యంలో, న్యాయవ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు  బడుగులకు అసలు అవకాశాలే దక్కేవి కావు. కానీ ఇప్పుడు ఉన్నత స్థానాలకు వెళ్తున్నారు. అలా వారు ఎదిగితే తమకు ఓట్లు  ఎవరు వేస్తారని భయపడుతున్న రాహుల్ గాంధీ భయంకరమైన కుట్రలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాలం మారింది.  నెహ్రూపరివారంలో చివరి వారసుడి తెలివితేటలను ఇప్పుడు అందరూ గమనిస్తున్నారు. నెహ్రూ చేసిన తప్పులే దేశానికి రాచపుండ్లుగా మారాయి.

వాటలన్నింటినీ బీజేపీ ప్రభుత్వం మాన్పిస్తూ వస్తోంది. కానీ కులాలను రెచ్చగొట్టి మళ్లీ తమ స్వార్థ రాజకీయాలతో బడుగుల్ని ఎదుగకుండా చేసేందుకు రాహుల్  కుట్ర చేస్తున్నారు. దాన్ని ప్రజలే తిప్పికొడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తాము ఒప్పుకున్న తప్పిదాలను గుర్తు చేసుకుని.. కరెక్ట్ చేసుకునేలా రాజకీయాలు చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించడం అసాధ్యంగా మారుతుంది.