తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో జవాబు చెప్పాలని స్పీకర్‌ను ఆదేశించింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే స్పీకర్ కోర్టు ధిక్కరణకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది. స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని ముందే చెప్పామని గుర్తుచేసింది. నూతన సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలని సీజేఐ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో, స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని వెల్లడించారు.
అనంతరం, రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. నాలుగు వారాల్లో జవాబు చెప్పాలని స్పీకర్‌ను ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో పదిమంది ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లు సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి.
ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని జులై 31వ తేదీన జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అయితే పలు కారణాలవల్ల ఆలోపు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కానందున స్పీకర్‌కు మరో రెండునెలలు పాటు గడువు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ శాసనసభ కార్యదర్శి దాఖలు చేసిన మిసిలేనియస్ అప్లికేషన్ సీజేఐ ధర్మాసనం ముందుకు వచ్చింది.ఈ సందర్బంగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

More Stories
సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మృతి
42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి
మహిళా చైతన్యంతోనే సమాజ పటిష్టత