ట్రంప్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బీబీసీ

ట్రంప్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బీబీసీ
అమెరికా అధ్య‌క్షుడు డోనాల్ట్ ట్రంప్‌కు ప్ర‌ఖ్యాత మీడియా సంస్థ బీబీసీ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ట్రంప్ ప్ర‌సంగాన్ని త‌ప్పుగా ఎడిట్ చేసి ప్ర‌సారం చేసిన‌ట్లు బీబీసీపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2021 జ‌న‌వ‌రి 6వ తేదీన ఆయ‌న చేసిన ప్ర‌సంగాన్ని బీసీసీ ఛాన‌ల్‌లో ప్ర‌సారం చేయ‌డం వ‌ల్లే క్యాపిట‌ల్ హిల్‌లో అల్ల‌ర్లు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 
అయితే దీనికి సంబంధించి కొన్ని రోజుల క్రితం బీసీసీలో ఉద్యోగం చేస్తున్న ఇద్ద‌రు ఉన్న‌త వ్య‌క్తులు రాజీనామా చేశారు. 
త‌మ‌ ప్రోగ్రామ్‌తో ట్రంప్ పేరుప్ర‌ఖ్యాత‌ల‌కు న‌ష్టం క‌లిగేలా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని బీసీసీ వెల్ల‌డించింది. ట్రంప్ దాఖ‌లు చేసిన బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్ట‌ప‌రిహారం కేసును బీబీసీ తోసిపుచ్చింది.  ఈ నేప‌థ్యంలో బీసీసీ చైర్మెన్ స‌మిర్ షా వైట్‌హౌజ్‌కు ప్ర‌త్యేకంగా లేఖ రాశారు. ట్రంప్ ప్ర‌సంగాన్ని ఎడిట్ చేసిన అంశంలో త‌న‌తో పాటు సంస్థ క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. తాము ప్ర‌సారం చేసిన ఆ వివాదాస్ప‌ద డాక్యుమెంట‌రీని మ‌ళ్లీ ప్ర‌సారం చేసే ప్ర‌ణాళిక లేద‌ని బీసీసీ వెల్ల‌డించింది.
తాము ఎడిట్ చేసిన ట్రంప్ ప్ర‌సంగం త‌ప్పుదోవ ప‌ట్టించే రీతిలో ఉన్న‌ట్లు అంగీకరిస్తున్నామ‌ని బీసీసీ చెప్పింది. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ట్రంప్ లాయ‌ర్ ఇటీవ‌ల బీబీసీకి లేఖ రాశారు. లేదంటే బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్ట‌ప‌రిహారం కేసు న‌మోదు చేయ‌నున్న‌ట్లు హెచ్చ‌రించారు. దీంతో బీబీసీ సంస్థ వెన‌క్కి త‌గ్గింది. ప‌నోర‌మా క‌రెంట్ అఫైర్స్ సిరీస్‌లో బీసీసీ ట్రంప్ ప్ర‌సంగాన్ని ప్రసారం చేసిన విష‌యం తెలిసిందే.

ఈ ఘ‌ట‌న‌లో  బీబీసీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టిమ్ డేవ్‌తో పాటు న్యూస్ డివిజ‌న్ సీఈవో డెబోర్నా ట‌ర్నెస్ రాజీనామా చేశారు.  ఓ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా బీబీసీ చేసిన పొర‌పాటుకు పూర్తి బాద్య‌త తీసుకుంటున్న‌ట్లు త‌న లేఖ‌లో డేవ్ పేర్కొన్నారు. బీసీసీలో ప్ర‌సారం అయ్యే ప‌నోరమా సిరీస్‌లో డాక్యుమెంట‌రీని ప్ర‌సారం చేశారు. ఆ సిరీస్‌తో బీబీసీ సంస్థ‌కు న‌ష్టం జ‌రుగుతున్న‌ట్లు న్యూస్ డివిజ‌న్ సీఈవో తెలిపారు. బీబీసీలోని ఇద్ద‌రు టాప్ ఉద్యోగులకు మెమో జారీ చేసిన అంశంపై టెలిగ్రాఫ్ ప‌త్రిక‌లో క‌థ‌నం రావ‌డంతో ఆ ఇద్ద‌రూ అధికారికంగా రాజీనామా అంద‌జేశారు.

“ట్రంప్: ఎ సెకండ్ ఛాన్స్?” అనే డాక్యుమెంటరీలో, జనవరి 6న ఆయన చేసిన ప్రసంగం నుండి ఒక క్లిప్ చూపించారు. అందులో ఆయన ఇలా అన్నారు” “మేము కాపిటల్‌కు నడిచి వెళ్తాము… నేను మీతో ఉంటాను. మేము పోరాడుతాము. మేము నరకంలా పోరాడుతాము.” వాస్తవానికి, ఈ వ్యాఖ్య ప్రసంగంలోని వివిధ భాగాల సవరణ. ట్రంప్ న్యాయవాదుల బృందం బిబిసి “జనవరి 6, 2021న మద్దతుదారులకు అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రసంగంలోని మూడు వేర్వేరు భాగాలను కలిపి దాని ప్రేక్షకులను పూర్తిగా తప్పుదారి పట్టించడానికి బిబిసి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించింది” అని పేర్కొంది.