4 నగరాల్లో ఇద్దరు చొప్పున మొత్తం 8 మంది పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిపారు. ఈ ఎనిమిది మందిలో ఉమర్, ముజమ్మిల్‌తో పాటు డాక్టర్ అదిల్, డాక్టర్ షాహీన్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ కుట్రను అమలుచేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్‌కు అప్పగించినట్లు సమాచారం. ఇందుకోసం నిందితులు దాదాపు రూ. 26 లక్షల వరకు నిధులు సేకరించి ఆ మొత్తాన్ని ఉమర్‌కు ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.
ఇందులో రూ.3 లక్షల విలువైన 20 క్వింటాళ్లకుపైగా ఎన్పీకే ఫెర్టిలైజర్‌ను గురుగ్రామ్, నూహ్ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించాయి. ఈ పదార్థాలను వినియోగించి వారు ఐఈడీ బాంబులను తయారుచేయాలని ప్లాన్ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, వీరి కుట్రలను పోలీసులు భగ్నం చేశారని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.
అటు ఆ డైరీల్లో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా జమ్ముకశ్మీర్, ఫరీదాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. దీంతో పాటు నవంబరు 8 నుంచి 12 వరకు తేదీలను ప్రస్తావించినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే వీరు దాడులకు పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. సమాచార మార్పిడి కోసం సిగ్నల్ యాప్‌లో ఉమర్ నలుగురు సభ్యులతో గ్రూప్ సృష్టించారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. జైషే మహమ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద మాడ్యూలే ఈ కుట్ర చేసినట్లు సమాచారం.
మరోవంక, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్(న్యాక్) షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఆ విద్యాసంస్థ వెబ్సైట్లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించినందుకుగానూ ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. ‘అల్-ఫలా వైద్య కళాశాల న్యాక్ గుర్తింపు పొందకుండానే వెబ్సైట్ కళాశాలో గుర్తింపు ఉందని బహిరంగా ప్రదర్శించింది. కనీసం అక్రిడేషన్ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. ఇది పూర్తిగా తప్పు. ప్రజలను, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులను తప్పుదారి పట్టించడమే అవుతుంది’ అని నోటీసుల్లో పేర్కొంది.
ఈ యూనివర్సిటీకి 2013లో న్యాక్ ‘ఏ’ గ్రేడ్ అందుకుందని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. 2014లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి యూనివర్సిటీ హోదా కల్పించింది. ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్-ఫలా మెడికల్ కాలేజీని ఏర్పాటుచేశారు.

More Stories
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రెడ్ కారిడార్: అశాంతి ముగింపుకు భారతదేశ సుదీర్ఘ యుద్ధం
తెలంగాణలో అంతర్జాతీయ చేపల ఎగుమతి కేంద్రం