ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పవన్ కాన్వాయ్ వెళ్తుండగా ఓ కారు హేమలత అనే మహిళ కాలు పైనుంచి వెళ్లిపోయింది. పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. వెంటనే సదరు మహిళను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తోపులాటలో పవన్ కారు టైర్ కిందపడి కాలు విరిగిందని బాధితురాలు హేమలత వాపోయారు.
కాన్వాయ్ వెళ్లేదారిలో జనాల తాకిడి ఎక్కువగా ఉండడంతో మహిళ స్పృహ తప్పికిందపడిపోయిందని అధికారులు తెలిపారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. పలమనేరు మండలం ముసలిమడుగులో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభిం చారు. మదపుటేనుగుల దాడుల నుంచి పంట పొలాలను, మనుషులను రక్షించేందుకు ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చిన కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్న అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం సందర్శించారు.
ఆదివారం, చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, ముసలమడుగు వద్ద ఉన్న శిక్షణ కేంద్రానికి విచ్చేసిన ఆయన ఏనుగుల శిక్షణ, సంరక్షణ తదితర అంశాలను స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక నుంచి తెచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతోపాటు గతంలో ఇదే శిక్షణ కేంద్రంలో ఉన్న మూడు కుంకీలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాయి.
శిక్షణలో కుంకీ ఏనుగులు చూపుతున్న మెలకువలు, ఇటీవల జరిగిన ఆపరేషన్ల తీరును అధికారులు వివరించారు. సందర్భంగా కుంకీ ఏనుగులు ప్రత్యేకంగా చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. క్రమబద్ధంగా కుంకీ ఏనుగులు వరుసగా వస్తూ ఘీంకారం చేస్తూ పవన్ కళ్యాణ్ కు సెల్యూట్ చేశాయి.

More Stories
ఆమరావతిలో ఎలివేటెడ్ కారిడార్
దుర్గగుడి అభివృద్ధికి త్వరితగతిన మాస్టర్‌ప్లాన్
జిఎస్టి ఆదాయం తగ్గడంపై ఏపీ ఆర్థికశాఖ ఆందోళన