* హైదరాబాద్ వ్యక్తి డా. అహ్మద్ మొహియుద్దీన్ కూడా అరెస్ట్
నిందితుల వద్ద నుంచి రెండు గ్లోక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 బుల్లెట్లు, 4 లీటర్ల ఆముదం నూనెను స్వాధీనం చేసుకుంది. నిందితుల్లో ఒకడైన డా. అహ్మద్ మొహియుద్దీన్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని గుజరాత్ డీఐజీ సునిల్ జోషి తెలిపారు. మరో ఇద్దరు నిందితులు ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారని పేర్కొన్నారు.
అహ్మద్ మొహియుద్దీన్ ఇప్పటికే పలు ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొన్నాడని తెలిపారు. అహ్మదాబాద్‌కు అతడు వస్తున్నట్టు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
36 ఏళ్ల వయసున్నఅహ్మద్ మొహియుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దేశంలో పెద్ద ఎత్తున నష్టం కలిగించే ఉగ్రదాడి చేయాలని అహ్మద్ మొహియుద్దీన్ భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. పలువురు విదేశీయులతోనూ టచ్‌లో ఉన్నట్టు గుర్తించారు. టెలిగ్రామ్ ద్వారా ఓ ఉగ్రసంస్థతో అతడు సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థ పదార్థాల నుంచి రైసిన్ అనే విషాన్ని తయారు చేస్తున్నట్టు గుర్తించారు.
గుజరాత్‌లోని కాలోల్ నుంచి ఆయుధాలు తీసుకుని మరో ప్రాంతానికి వెళ్తుండగా అహ్మద్ మొహియుద్దీన్ చిక్కినట్టు పోలీసులు చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులను గుజరాత్‌లోని బనస్కాంతలో అరెస్టు చేశారు. ఉగ్రవాదానికి వీరు బాగా ప్రభావితమైనట్లు గుర్తించారు. వీరిద్దరు కూడా విదేశాల్లోని పలువురితో టచ్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడుల కోసం ఇప్పటికే దిల్లీ, అహ్మదాబాద్, లఖ్‌నవూలో రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు.

More Stories
జూబ్లీహిల్స్ విషయంలో మీడియా ఎక్కడ దారితప్పుతున్నదంటే.. !
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత
పాతబస్తీలో హిందూ మైనర్ అమ్మాయిలపై డ్రగ్స్ రాకెట్ పంజా