‘వందేమాతరం’ అనే పదం మన వర్తమానంలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, సాధించలేని లక్ష్యం ఏదీ లేదని ధైర్యాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శుక్రవారం ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏడాది పొడవునా జరిగే జాతీయ గీతం “వందేమాతరం” స్మారక కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. స్మారక స్టాంపు, నాణెంను కూడా విడుదల చేశారు.
“ఈ రోజు మనం ‘వందేమాతరం’ 150 సంవత్సరాలు జరుపుకుంటాము; ఇది మనకు కొత్త ప్రేరణను ఇస్తుంది, దేశ ప్రజలను కొత్త శక్తితో నింపుతుంది” అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో చెప్పారు. “ఈరోజు, నవంబర్ 7, ఒక చారిత్రాత్మక దినం. వందేమాతరం సృష్టించబడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం కోట్లాది మంది భారతీయులలో కొత్త శక్తిని నిర్మిస్తుంది. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడికి నా శుభాకాంక్షలు…” అని తెలిపారు.
వందేమాతర గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం, అదొక స్ఫూర్తి మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వందేమాతరం గీతం దేశమాత ఆరాధన, సాధన అని పేర్కొంటూ జాతీయ గీతం అందరినీ పురాణ ఇతిహాసాల్లోకి తీసుకెళ్తుందని, ఆ శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతుందని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని, వందేమాతరం సామూహిక గీతాలాపన అద్భుత అనుభవమని చెప్పారు.
ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని, ఈ స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి గీతానికి ఒక మూల భావం, సందేశం ఉంటుందిని చెబుతూ ప్రధాని వందేమాతరం మూల భావం భారత్ అని చెప్పారు.
“`వందేమాతరం’ ప్రధాన భావోద్వేగం భారత్, మా భారతి… భారత్ ఏక్ రాష్ట్ర కే రూప్ మే వో కుందన్ బన్ కర్ ఉభ్రా జో అతీత్ కి హర్ చోట్ సేహ్తా రహా ఔర్ శేఖర్ భీ అమరత్వ కో ప్రాప్త్ కర్ గయా. (భారతదేశం ఒక దేశంగా గతంలోని ప్రతి దెబ్బను భరించిన రత్నంగా ఉద్భవించింది మరియు సహకారం ద్వారా అమరత్వాన్ని కూడా సాధించింది)…” అని వివరించారు.
ఈ కార్యక్రమం నవంబర్ 7, 2025 నుండి నవంబర్ 7, 2026 వరకు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరిగే స్మారకోత్సవాన్ని అధికారికంగా ప్రధాని ప్రారంభించారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన, జాతీయ గర్వం, ఐక్యతను రేకెత్తిస్తూనే ఉన్న 150 సంవత్సరాలను జరుపుకుంటుంది.
“మనం వందేమాతరం 150 అద్భుతమైన సంవత్సరాలను జరుపుకుంటున్నాము, ఇది తరతరాలకు స్ఫూర్తినిచ్చిన మరియు మన దేశం అంతటా అమర దేశభక్తి స్ఫూర్తిని రగిలించిన ఉత్తేజకరమైన పిలుపు” అని ప్రధాన మంత్రి ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వేడుకలలో ఉదయం 9:50 గంటలకు బహిరంగ ప్రదేశాలలో ‘వందేమాతరం’ పూర్తి వెర్షన్‌ను సామూహికంగా పాడతారు, ప్రధాన కార్యక్రమంతో పాటు సమాజంలోని అన్ని వర్గాల పౌరుల భాగస్వామ్యం ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.

More Stories
ఉగ్ర యత్నం భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు.. ముగ్గురు అరెస్ట్
భారత్ ను అగ్రగామి కావించే `స్వ’ మంత్రం `వందేమాతరం’
బిహార్ చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో పోలింగ్