భారత్ నాలుగో టీ20లో ఘన విజయం

భారత్  నాలుగో టీ20లో ఘన విజయం
ఆస్ట్రేలియా టీ20 సిరీస్​లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఓవల్ వేదికగా తాజాగా జరిగిన నాలుగో టీ20లో టీమ్ఇండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 119 రన్స్​కు ఆలౌటైంది.  ఈ విజయంతో 5 టీ20ల సిరీస్​లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది.
 
సిరీస్‌ కోల్పోకుండా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా బంతితో మెరిసి కంగారూలపై 48 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని నమోదుచేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అక్షర్‌ పటేల్‌ (బ్యాట్‌తో 21*, బంతితో 2/20) ఆల్‌రౌండ్‌ షో తో సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో నిలిచింది. 
 
క్వీన్స్‌లాండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (28), కెప్టెన్ సూర్యకుమారి యాదవ్ (10 బంతుల్లో 20), అక్షర్ పటేల్ (21), శివమ్ దూబే (22) ప‌రుగుల‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. 
 
అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది.  ఒక దశలో పటిష్ఠంగానే కనిపించిన ఆసీస్, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ప‌రాజ‌యం పాలైంది. ముఖ్యంగా చివరి 28 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి 119 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ చివర్లో మూడు కీలక వికెట్లు పడగొట్టగా, ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన అక్షర్ పటేల్, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు తీసి ఆసీస్ పతనంలో కీలక పాత్ర పోషించారు.
అలాగే అర్ష్‌దీప్ సింగ్‌, బబ్రూ, వరుణ్ చక్రవర్తి త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయాలు కూడా భారత్ విజయానికి దోహదపడ్డాయి. బౌలింగ్ మార్పులు, డీఆర్ఎస్ కాల్స్‌లో అతను చూపిన చురుకుదనం ఫలితాన్నిచ్చింది. సిరీస్‌లో మరొక మ్యాచ్ మిగిలి ఉండగా, భారత్ సిరీస్ కైవసం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది.