సుమారు 12మంది సిక్కు యాత్రికులు మంగళవారం పాకిస్తాన్‌కు చేరుకున్నారు. మే నెలలో పహల్గాం దాడి తర్వాత భారత సరిహద్దును దాటడం మొదటిసారి. మంగళవారం ఉదయం భారత సరిహద్దు వైపు యాత్రికులు క్యూ కట్టారని, సరిహద్దు భద్రతా దళాలు చూస్తుండగా కొందరు తమ లగేజీని తలలపై మోసుకెళ్లినట్లు మీడియా తెలిపింది.
వాఘా -అట్టారి సరిహద్దులో 12మందికి పైగా యాత్రికులు పాకిస్తాన్లోకి ప్రవేశించినట్లు పేర్కొంది. వారిని పాకిస్తాన్ అధికారులు ఘనంగా స్వాగతించినట్లు వెల్లడించింది. సుమారు 1,700మంది పాకిస్తాన్లోకి ప్రవేశించనున్నట్లు మీడియా తెలిపింది. వీరంతా బుధవారం లాహోర్‌కు పశ్చిమాన 80కి.మీ దూరంలోని గురునానక్ జన్మస్థలమైన నంకనా సాహిబ్‌కు చేరుకుంటారు.
అనంతరం గురునానక్ సమాధి ప్రాంతమైన కర్తార్‌పూర్, పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలను సందర్శిస్తారు. గురునానక్ 556వ జయంతిని పురస్కరించుకుని 10 రోజుల పాటు జరిగే ఉత్సవంలో పాల్గొనడానికి 2,100 మందికి పైగా యాత్రికులకు వీసాలు మంజూరు చేసినట్లు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం గతవారం తెలిపింది.
1999 తర్వాత పహల్గాం దాడితో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన సంగతి తెలిసిదే. మిసైల్, డ్రోన్, ఫిరంగి దాడుల్లో 70మందికి పైగా మరణించారు. ఉద్రిక్తతలతో రెండు దేశాల మధ్య ఉన్న ఏకైక భూ సరిహద్దు ప్రాంతం వాఘా-అట్టారిలో ట్రాఫిక్‌ను నిషేధించారు. ప్రధాన సరిహద్దు దాటకుంటా వీసారహిత మార్గం కర్తార్‌పూర్ కారిడార్‌ను 2019లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఉద్రిక్తతల అనంతరం ఈ రహదారిని మూసివేశారు.

More Stories
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా హైదరాబాదీ మహిళ గజాలా హాష్మీ
జైలులో ఇజ్రాయిల్ అత్యున్నత సైనిక న్యాయవాది
ఆసియా కప్‌లో పాక్ పేసర్‌పై నిషేధం.. భారత కెప్టెన్‌కు భారీ జరిమానా!