క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్‌-2026లో 5 ఐఐటీలు

క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్‌-2026లో 5 ఐఐటీలు

క్యూఎస్ ఆసిAdd Postయా ర్యాంకింగ్స్‌-2026లో దేశంలోని 5 ఐఐటీలు, డిల్లీ విశ్వవిద్యాలయం, బెంగళూరులోని ఐఐఎస్సి టాప్‌-100లో నిలిచాయి. మరో 20 సంస్థలు టాప్‌-200లో చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు లండన్ కేంద్రంగా పనిచేసే క్యూఎస్ సంస్థ ఆసియాలోని 500 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో కూడిన జాబితాను విడుదల చేసింది.

హాంకాంగ్ విశ్వవిద్యాలయం తొలిస్థానంలో నిలిచింది. 59వ స్థానంలో ఉన్న ఐఐటీ ఢిల్లీ దేశంలో అత్యుత్తమ ర్యాంకును సాధించింది. గతేడాదితో పోలిస్తే 36 సంస్థలు తమ ర్యాంకులను మెరుగుపర్చుకున్నాయని క్యూఎస్ సంస్థ పేర్కొంది. 16 సంస్థలు మాత్రం అవే ర్యాంకుల్లో ఉన్నాయని వెల్లడించింది.

క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్‌లో భారతీయ విశ్వవిద్యాలయాల సంఖ్య పెరగటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువతకు నాణ్యమైన విద్యను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఎక్స్‌లో పోస్టు చేశారు. ముఖ్యంగా పరిశోధన, ఆవిష్కరణలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని రాసుకొచ్చారు.

క్యూఎస్ఆసియా ర్యాంకింగ్స్ 2026లో భారతీయ సంస్థలు

ర్యాంక్ 59: ఐఐటీ ఢిల్లీ 
ర్యాంక్ 64: ఐఐఎస్సి, బెంగళూరు 
ర్యాంక్ 70:  ఐఐటీ మద్రాస్ 
ర్యాంక్ 71:  ఐఐటీ బాంబే 
ర్యాంక్ 77:  ఐఐటీ కాన్పూర్ 
ర్యాంక్ 77: ఐఐటీ ఖరగ్‌పూర్ 
ర్యాంక్ 114: ఐఐటీ రూర్కీ 
ర్యాంక్ 115:  ఐఐటీ గువాహటి 
ర్యాంక్ 156: వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూరు 
ర్యాంక్ 206: మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్