అయితే యాత్రకు వెళ్లిన భక్తుల బృందంలో మతపరమైన వివక్ష చూపిన సంఘటన సంచలనం సృష్టించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిన తొలి సిక్కు యాత్ర ఇదే కాగ పాకిస్థాన్ అధికారులు హిందూ యాత్రికులను సరిహద్దు దాటడానికి అనుమతించలేదు. వాఘా సరిహద్దు వద్ద హిందూ యాత్రికులు ఇమ్మిగ్రేషన్, ప్రయాణ లాంఛనాలన్నింటినీ పూర్తి చేసినప్పటికీ వారిని చివరి నిమిషంలో ఆపివేయడం భారతీయ అధికారులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఢిల్లీకి చెందిన అమర్ చంద్ అనే యాత్రికుడు తన కుటుంబ సభ్యులు ఏడుగురితో సహా యాత్రకు వెళ్లారు. “మేము అట్టారి అంతర్జాతీయ సరిహద్దు దాటి వాఘాకు చేరుకుని ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు పూర్తి చేశాం. ప్రత్యేక బస్సు టిక్కెట్లు కూడా కొనుగోలు చేశాము. సరిగ్గా బస్సు ఎక్కబోతున్న సమయంలో అధికారులు మమ్మల్ని ఆపేశారు. మీరు హిందువులు.. సిక్కులతో కలిసి వెళ్లడానికి వీల్లేదని పాకిస్థాన్ అధికారులు తమకు చెప్పినట్లు అమర్ చంద్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు పాకిస్థాన్‌లో జన్మించిన సింధీలైన 14 మంది హిందువులు భారత పౌరసత్వం పొందారు. పాకిస్థాన్‌లోని తమ బంధువులను కలిసేందుకు తగిన ప్రతాలతో ఆ దేశంలోకి ప్రవేశించారు. అయితే ‘మీరు సిక్కులు కాదు హిందువులు’ అని పాక్ అధికారులు వారిని అవమానించారు. కేవలం సిక్కులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. భారతీయ హిందువులైన 14 మందిని వెనక్కి పంపారు. దీంతో వారంతా నిరాశతో భారత్‌కు తిరిగి వచ్చారు.
అయితే ఈ మతపరమైన విభజన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఇస్లామాబాద్ ఉద్దేశపూర్వకంగా విభేదాలు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నంగా అంతా భావిస్తున్నారు. ఈ చర్యతో సిక్కులు, హిందువుల మధ్య అంతరాలు సృష్టించాలని పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని యాత్రికులు, నిఘా వర్గాల అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

More Stories
హరియాణాలో ఓట్లు చోరీ.. రాహుల్ ఆరోపణలను కొట్టేసిన ఈసీ
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా హైదరాబాదీ మహిళ గజాలా హాష్మీ
మొంథా తుఫాన్ బాధిత రైతులకు పంటల భీమా ప్రశ్నార్ధకం!