ఆసియా కప్‌లో పాక్ పేసర్‌పై నిషేధం.. భారత కెప్టెన్‌కు భారీ జరిమానా!

ఆసియా కప్‌లో పాక్ పేసర్‌పై నిషేధం.. భారత కెప్టెన్‌కు భారీ జరిమానా!

ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ క్రికెటర్ల తీరుపై విచారణ చేపట్టిన ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రికెట్ మైదానంలో రెచ్చగొట్టే చేష్టలు, రాజకీయ అంశాలను ప్రస్తావించడాన్ని ఏమాత్రం సహించమని స్పష్టం చేసింది. భారత్, పాకిస్థాన్ మధ్య తొలి లీగ్ దశ మ్యాచ్‌లో రెచ్చగొట్టే సంజ్ఞలు చేసినందుకుగానూ  పేసర్ హ్యారిస్ రవుఫ్‌ పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఐసీసీ నియమావళిని ఉల్లఘించినందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా వేసింది.

ఆసియా కప్‌లో లీగ్ దశలో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌ టాస్‌ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో షేక్ హ్యాండ్ చేసేందుకు నిరాకరించాడు. ఇక బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు భారత ప్రేక్షకులు హ్యారిస్ రవుఫ్‌ను కోహ్లీ కోహ్లీ అని ఆటపట్టించారు. 

అందుకు అతడు విమానాల్ని కూల్చివేసినట్టుగా సంజ్ఞలు చేశాడు. అంతేకాదు ఆరు జెట్లను కూల్చాం అని చేతివేళ్లను చూపిస్తూ భారత క్రికెటర్లనే కాదు అభిమానులను రెచ్చగొట్టాడు. అనంతరం పాక్ ఇన్నింగ్స్‌లో అర్ధశతకం తర్వాత ఓపెనర్ ఫర్హాన్ గన్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. వీరి చర్యలను తీవ్రంగా పరిగణించిన భారత బోర్డు రిఫరీకి ఫిర్యాదు చేసింది. 

అయితే మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ పహల్గాం మృతులకు విజాయన్ని అంకితమివ్వడం, భారత సైనికుల పరాక్రమాన్ని కొనియడడంపై పాక్ బోర్డు అభ్యంతరం తెలిపింది. తమ సారథితో కరచాలనం చేయకపోగా రాజకీయ వ్యాఖ్యలు చేశాడని సూర్యపై ఫిర్యాదు చేసింది. అయితే Aటోర్నీ సమయంలో గొడవను పెద్దది చేయడం ఇష్టంలేక తాత్కాలికంగా హెచ్చరికలతో సరిపుచ్చింది ఐసీసీ. తాజాగా ఇరుదేశాల బోర్డుల ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినందుకు కఠిన చర్యలు తీసుకుంది.