బీహార్ లో 129 మంది పాతవారినే తిరిగి నిలబెడుతున్న ఎన్డీయే

బీహార్ లో 129 మంది పాతవారినే తిరిగి నిలబెడుతున్న ఎన్డీయే
బీహార్‌లో తిరిగి అధికారంలోకి రావడానికి ప్రభుత్వం వ్యతిరేకతను తట్టుకోవాలని భావిస్తున్నప్పటికీ, ఈసారి 2020 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులలో ఎక్కువ మందికి తిరిగి పోటీ చేసే అవకాశం బిజెపి ఇచ్చింది.  వారిలో ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. పాలక ఎన్డీయేలో ఈసారి బిజెపి, జెడియు, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) ఉన్నాయి. 2020లో, అవిభక్త ఎల్జేపీ, ఆర్ఎల్ఎం ఎన్డీయేలో భాగం కాలేదు. అయితే ఇప్పుడు మహాఘట్బంధన్‌లో ఉన్న వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) కూడా ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. 
 
మొత్తంగా, ఎన్డీయే 114 మంది కొత్త అభ్యర్థులను నిలబెట్టింది. గతసారి ఓటమి చెందిన 37 మందితో సహా 129 మంది పాతవారికి తిరిగి అవకాశం ఇచ్చింది. 2020తో పోలిస్తే బిజెపికి 35 కొత్త ముఖాలు ఉండగా, దాదాపు 66 మంది పాతవారికే తిరిగి అవకాశం ఇచ్చింది. తిరిగి పోటీ చేస్తున్న 66 మంది అభ్యర్థులలో 54 మంది గతసారి గెలిచారు. మరో మాటలో చెప్పాలంటే, ఆ పార్టీ గెలిచిన అభ్యర్థులలో 20 మందిని తొలగించింది. 2020లో 74 స్థానాలను గెలుచుకుంది, ఓడిపోయిన 12 మంది అభ్యర్థులను పునరావృతం చేసింది. 
 
రెండవ అతిపెద్ద ఎన్డీయే భాగస్వామి, నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియు గత ఎన్నికలలో పోటీచేసిన 50 మందిని తిరిగి నిలబెడుతూ ఉండగా, 51 మంది కొత్తవారికి అవకాశం ఉచ్చింది. తిరిగి పోటీ చేస్తున్న వారిలో 2020 నుండి 43 మంది విజేతలలో 33 మంది, గతసారి ఓడిపోయిన 17 మంది ఉన్నారు. 2020లో ఎన్డీయేలో కొత్తగా భాగమైన ఎల్జేపీ (ఆర్వి), ఆర్ఎల్ఎంలు ఈ సారి వరుసగా 21, 4 మంది కొత్త అభ్యర్థులను నిలబెట్టాయి. 
 
చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (ఆర్వీ) ఈసారి 29 స్థానాల్లో పోటీ చేస్తుంది, గతసారి అవిభక్త ఎల్జేపీగా 143 స్థానాలలో పోటీచేసి 1 స్థానం మాత్రమే గెల్చుకుంది. కానీ అనేక మంది జెడియు అభ్యర్థుల అవకాశాలను దెబ్బతీసిందని నమ్ముతారు. తర్వాత, దాని ఏకైక ఎమ్మెల్యే జెడి(యు)లోకి మారారు. ఎల్జెపి(ఆర్వి) ప్రస్తుతం పోటీ చేస్తున్న 29 సీట్లలో, గత సారి18 సీట్లలో మాత్రమే పోటీ చేసింది. వారిలో దాదాపు సగం మందికి, అంటే 8 మందికి తిరిగి పోటీచేసే అవకాశం ఇచ్చింది.
 
‘గ్రాండ్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్’లో భాగంగా 2020లో 104 సీట్లలో పోటీ చేసి, ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎం, ఇప్పుడు ఎన్డీఏలో భాగంగా 6 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది. వీటిలో 2020లో పోటీ చేసిన 4 స్థానాలు ఉన్నాయి. ఈ 4 స్థానాల్లో, 2 స్థానాల్లో కొత్త ముఖాలను నిలబెడుతున్నది. జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎం(ఎస్) ఈసారి 6 స్థానాల్లో పోటీ చేస్తుంది. 2020లో కంటే 1 తక్కువ. 2020లో పోటీ చేసిన 3 స్థానాలలో మాత్రమే తిరిగి పోటీ చేస్తుంది. 
 
మాంఝీ ఎంపీ అయిన తర్వాత గత సంవత్సరం అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలిచిన ఆయన భార్య దీపను తిరిగి నిలబెట్టింది. 2 కొత్త అభ్యర్థులను నిలబెట్టింది. మొత్తంమీద, ఎన్డీయే మిత్ర పక్షాలు 114 స్థానాల్లో కొత్త ముఖాలను నిలబెట్టాయి. వాటిలో 2020లో వారు కేవలం 30 స్థానాల్లో మాత్రమే గెలిచారు. ఎన్డీయే సగటున 15,150 ఓట్ల తేడాతో గెలిచి, అన్ని స్థానాల్లో 30 శాతం కంటే ఎక్కువ ఓట్లను గెలుచుకున్నప్పటికీ ఈ 30 స్థానాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించారు.
 
మహాఘట్బంధన్ 122 సీట్ల మెజారిటీకి తక్కువగా ఉండటంతో, ఎన్డీయే 2020 ఫలితాన్ని దృష్టిలో ఉంచుకున్నట్లు కనిపిస్తుంది. ఎన్డీయే గెలవని 84 సీట్లలో కొత్త అభ్యర్థిని నిలబెట్టింది. వీటిల్లో ప్రతిపక్ష మహాఘట్బంధన్ 78 సీట్లను గెలుచుకుంది. (ఆర్జేడీ నేతృత్వంలో 53 సీట్లు, వామపక్ష పార్టీలు 15 సీట్లు, కాంగ్రెస్ 10 సీట్లు గెలుచుకున్నాయి). కాగా, ఏఐఎంఐఎం,  అవిభక్త ఎల్జేపీ, బీఎస్పీ, ఒక స్వతంత్ర అభ్యర్థి గెల్చుకున్న సీట్లు ఉన్నాయి.
 
ఎన్డీయే ఈ 84 సీట్లలో 2020 ఎన్నికలలో సగటున తక్కువగా పొందిన18,070 ఓట్ల తేడాను అధిగమించడంలో అదనంగా కూటమిలో చేరిన పార్టీలు సహాయపడతాయని ఆశిస్తున్నది. సహాయపడుతుందని ఆశిస్తోంది. ఎన్డీయే తిరిగి పోటీచేస్తున్న 129 సీట్లలో 92 సీట్లను గత ఎన్నికలలో 30 శాతం కంటే ఎక్కువ ఓట్లతో గెల్చుకున్నవే.  ఈసారి ఎన్డీఏలో ఎల్జేపీ(ఆర్వీ), ఆర్ఎల్ఎంలను కలుపుకుని విస్తరించడంతో, కూటమిలో 49 సీట్లను వదులుకోవలసి వచ్చింది. 
 
అయితే ఈ 49 స్థానాల్లో ఎన్డీఏ కేవలం 10 స్థానాలను మాత్రమే గతంలో గెలుచుకుంది. (బీజేపీ 4, జేడీ(యూ) 2. అప్పటి మిత్రపక్షం వీఐపీ 4. మహాఘటబంధన్ మిగిలిన సీట్లలో 35 గెలుచుకుంది, ఏఐఎంఐఎం 3, బీఎస్పీ 1 గెలుచుకుంది. ముఖ్యంగా, వీఐపీ నిష్క్రమణ వల్ల ఎన్డీఏ మిత్రపక్షాల మధ్య పునఃపంపిణీ కోసం 11 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ కొత్త సీట్లలో 8 సీట్లకు బీజేపీ పోటీ చేస్తోంది.  వీటిలో 4 స్థానాలకు గతసారి జేడీ(యూ) పోటీ చేయగా, మరో 4 స్థానాలకు వీఐపీ పోటీ చేసింది.
 
బీజేపీ గతసారి అభ్యర్థిని నిలబెట్టిన 5 స్థానాలకు జేడీ(యూ) పోటీ చేస్తుంది. ఎల్జేపీ(ఆర్వీ) పార్టీకి చెందిన అనేక మిత్రపక్షాలు తమ సీట్లను త్యాగం చేశాయి, వాటిలో జేడీ(యూ) 11, బీజేపీ 10, హెచ్ఏఎం(ఎస్) 2 స్థానాలు ఉన్నాయి. అంతేకాకుండా, 2020లో విఐపి అభ్యర్థులు పోటీ చేసిన 6 స్థానాల్లో ఎల్జేపీ (ఆర్వీ) పోటీ చేస్తుంది. ఆర్ఎల్ఎంకు 6 స్థానాల్లో 2020లో జెడియు పోటీ చేసిన 3 స్థానాలు, బిజెపి 2 స్థానాలు, విఐపి 1 స్థానం ఉన్నాయి. ఎచ్ఏఎం(ఎస్) పోటీ చేసే 6 స్థానాల్లో ఒకదానిలో 2020లో జెడియు అభ్యర్థి పోటీ చేశారు.