 
                వారి వివరాలు పరిశీలించి, నిజమైన భారతీయులేనని నిర్ధరించిన తర్వాతే వారిని వెనక్కి పంపించే ప్రక్రియ పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. భారత్-అమెరికా మధ్య ఉన్న చట్టపరమైన, దౌత్య విధానాలను అనుసరించే బహిష్కరణలు జరిగాయని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికాతో పాటు ఈ ఏడాది యునైటెడ్ కింగ్డమ్ నుంచి బహిష్కరణకు గురైన భారతీయుల సంఖ్య గురించిన వివరాలను కూడా ఆయన వెల్లడించారు.
“యూకే నుంచి ఈ ఏడాది సుమారు 100 మంది భారతీయ పౌరులు బహిష్కరించారు. వారి జాతీయతను కూడా ధ్రువీకరించిన తర్వాతే యూకే ఈ చర్యలు తీసుకుంది” అని ఆయన చెప్పారు. మరోవైపు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటా ప్రకారం అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడిన భారతీయ పౌరుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నాలుగేండ్లలో కనిష్ట స్థాయికి చేరింది.
అక్టోబర్ 2024-సెప్టెంబర్ 2025 మధ్య అనుమతి లేకుండా అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నించిన 34,146 మంది భారతీయులను అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో 90,415 మందిని యూఎస్ అధికారులు నిర్బంధించారు. ఈ లెక్కన గతంతో పోలిస్తే ఈ సంఖ్య 62 శాతం తగ్గింది.“ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకూ అమెరికాలో ఉండటానికి కావలసిన అర్హత ప్రమాణాలను పాటించని, అక్రమంగా నివసిస్తున్న 2,790 మందికిపైగా భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారు. వారు అక్కడ చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు. వారి జాతీయతను, గుర్తింపును మేమే ధ్రువీకరించాం. ఆ తర్వాత వారిని అమెరికా నుంచి వెనక్కి పంపించారు” అని తెలిపారు.





More Stories
కాంకేర్ జిల్లాలో మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు
ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్గా ఔరంగాబాద్