 
                పది సంవత్సరాల క్రితం చిత్తూరు పట్టణంలో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఐదు మంది దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ శుక్రవారం చిత్తూరు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఈ తీర్పు ఇచ్చారు. కేసులో ఏ1 నుండి ఏ5 వరకు ఉన్న ఐదు ముద్దాయిల పై హత్య నేరం రుజువైందని వారం రోజుల కిందట కోర్టు తీర్పులో పేర్కొన్నారు.
వారికి వారం రోజుల తర్వాత 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు శిక్షను ఖరారు చేశారు. ముందుగా దోషులతో జడ్జి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గురువారం దోషుల తరపున న్యాయవాదులు శిక్ష తగ్గించాలని సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. జైలులో వారి ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితుల పైన నివేదికను తెప్పించుకున్నారు. అన్నింటినీ బేరీజు చేస్తూ కోర్టు శుక్రవారం ఏ మేరకు ఉరిశిక్ష విధిస్తూ ప్రకటించింది.
హత్యా నేరం విలువైన వారిలో చింటూ అలియాస్ చంద్రశేఖర్, వెంకటాచలపతి, జయప్రకాశ్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ ఉన్నారు. ఐదు మంది మీద నేరము రుజువు కావడంతో 18 మందిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. శుక్రవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో చిత్తూరులో 144 సెక్షన్ విధించారు. ఎక్కడ ఎలాంటి అవార్ధనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే 2015 నవంబర్ 17వ తేదీన చిత్తూరు నగర మేయర్ కటారి అనూరాధ ఛాంబర్ లోని సీటులో కూర్చుని విధి నిర్వహణలో ఉండగా, ఆమె భర్త మోహన్ కూడా అక్కడే ఉన్నారు. వారితో పాటు కొందరు టీడీపీ నేతలు కూడా ఉన్నారు. అదే సమయంలో ముసుగు ధరించిన కొందరు తొపాకులు, కత్తులతో మేయర్ ఛాంబర్ లోకి దూసుకుని వచ్చారు.
మేయర్ అనూరాధను తుపాకీతో కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆమె భర్తను కత్తులతో వేటాడి చంపారు. దీంతో నగర పాలక సంస్థ కార్యాలయం రక్తంతో తడిసింది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ప్రధాన నిందితుడిగా మేయర్ కటారి అనూరాధ, మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ తోపాటు ఈ కుట్ర వెనుక 23 మందిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈయన ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ మెంట్ తీసుకున్నారు.
మేయర్ కటారి అనూరాధ, మోహన్ దంపతుల హత్య నేపథ్యంలో చిత్తూరు-1 పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 2016 ఫిబ్రవరి 18వ తేదీ చార్జిషీట్ దాఖలు చేశారు. పోలీసుల కథనం మేరకు 2015 నవంబర్ 17వ తేదీ ఉదయం 11.45 గంటలకు నిందితులు ఎస్ చంద్రశేఖర్ అనే చంద్రశేఖర్, వెంకటచలపతి ఆనే ములబగల్ వెంకటేష్ తుపాకులు, ప్రాణాంతకమైన ఆయుధాలతో బుర్కాలు ధరించి, మరో జయప్రకాశ్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ కలిసి వచ్చారు.
మేయర్ కార్యాలయంలోనే అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ పై దాడి చేసి హత్య చేశారు. ఈ దాడి ఆస్తి, ఆర్థిక వివాదాల కారణంగా జరిగింది. ఈ కేసులో మొత్తం ఏ1 నుంచి ఏ23 వరకు నిందితులు వివిధ పాత్రలతో నేరానికి కుట్ర పన్నడం, నేరంలో పాల్గొనడం, ప్రధాన నిందితుడికి ఆశ్రయం ఇవ్వడం, ఆయుధాలు సరఫరా చేయడం వంటి కుట్రలో భాగస్వాములయ్యారని చార్జ్ షీట్‌లో ఆరోపించారు.
పట్టపగలు చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మేయర్ కటారి అనూరాధ, మోహన్ దంపతుల హత్య ఘటన సంచలనం రేకెత్తింది. పోలీసుల దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో దీర్ఘకాలం విచారణ సాగింది. ఈ కేసులో కొందరు జైలులో ఉన్నారు. ఇంకొందరు మరణించారు.
ఈ కేసులో నిందితిడిగా ఉన్న ఏ22 కసారం రమేష్ కేసు నుంచి విడుదలయ్యాడు. ఏ21 ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తి మరణించాడు. ఏ3, ఏ4గా ఉన్న నిందితులు చిత్తూరు జిల్లా జైలులో ఉన్నారు. హత్య కేసులో ప్రధాన నిందితులు చంద్రశేఖర్, వెంకటచలపతి అనే మూలబగల్ వెంకటేష్ బెయిల్ పై బయట ఉన్నారని పోలీసులు వెల్లడించారు.





More Stories
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
యమునా నదిని పరిశుభ్రం చేయడం అసాధ్యం కాదు!
బీహార్ లో 129 మంది పాతవారినే తిరిగి నిలబెడుతున్న ఎన్డీయే