 
                రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండల బైఠక్ జబల్పూర్లోని కచ్నార్ నగరంలో గురువారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే సమావేశాన్ని సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్ కార్యవాహ  దత్తాత్రేయ హోసబాలే ప్రారంభించి భారత మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సమావేశంలో మొత్తం ఆరుగురు సహ- సర్ కార్యవహులు డాక్టర్ కృష్ణ గోపాల్, ముకుందా, అరుణ్ కుమార్, రామదత్ చక్రధర్, అలోక్ కుమార్, అతుల్ లిమాయేలతో పాటు అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు, 46 సంఘ్ ప్రాంత్ ల నుండి సంఘచాలక్‌లు, కార్యవాహులు, ప్రచారకులుమొత్తం 407 మంది పాల్గొన్నారు.
 సమావేశం ప్రారంభంలో, ఇటీవల మరణించిన అనేక మంది ప్రముఖ వ్యక్తులకు నివాళులర్పించారు. వారిలో రాష్ట్ర సేవిక సమితి మాజీ ప్రముఖ్ సంచాలికా ప్రమీలా తాయ్ మేధే, సీనియర్ ప్రచారక్ మధు భాయ్ కులకర్ణి, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (గుజరాత్), శిబు సోరెన్ (జార్ఖండ్), ఢిల్లీ సీనియర్ నాయకుడు విజయ్ మల్హోత్రా, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరిరంగన్, మాజీ గవర్నర్ ఎల్. గణేశన్, గీత రచయిత పియూష్ పాండే, సినీ నటులు సతీష్ షా, పంకజ్ ధీర్, హాస్యనటుడు అస్రానీ, ప్రఖ్యాత అస్సామీ సంగీతకారుడు జుబీన్ గార్గ్ ఉన్నారు.
పహల్గామ్ సంఘటనలో మరణించిన హిందూ పర్యాటకులకు, ఎయిర్ ఇండియా విషాద బాధితులకు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, ఉత్తరాఖండ్, పంజాబ్, దేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా నివాళులు అర్పించారు. ప్రకృతి వైపరీత్యాల బారిన పడిన వివిధ ప్రాంతాలలో సమాజ సహకారంతో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు చేపట్టిన సహాయ,సేవా కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పంచుకున్నారు. 
ఈ సమావేశంలో, గురు తేజ్ బహదూర్ జీ 350వ అమరవీరుల వార్షికోత్సవం, బిర్సా ముండా 150వ జయంతి, వందేమాతరం కూర్పుకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రకటనలు విడుదల చేస్తారు. సంబంధిత కార్యక్రమాలపై కూడా చర్చలు జరుగుతాయి. గృహ సంపర్క్ అభియాన్, హిందూ సమ్మేళనాలు, సద్భావ బైఠక్‌లు, ప్రముఖ్ జన్ సంగోష్టి వంటి రాబోయే ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరం కార్యక్రమాలకు సన్నాహాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. ఇటీవలి విజయదశమి వేడుకల సమీక్ష, ప్రస్తుత జాతీయ పరిస్థితిపై చర్చలు ఉంటాయి. 
                            
                        
	                    




More Stories
బీహార్ లో ప్రతిపక్షం గెలిస్తే పిఎఫ్ఐ కార్యకర్తలను జైల్లోనే ఉంచుతారా?
ఛత్తీస్‌గఢ్‌లో మరో 51 మంది నక్సలైట్లు లొంగుబాటు
బిహార్‌కు గూండా రాజ్ అవసరం లేదు