బిహార్‌కు గూండా రాజ్ అవసరం లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఎద్దేవా చేశారు. పాట్నాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆర్జేడీ జంగిల్ రాజ్ పాలన వల్ల జరిగిన నష్టాన్ని అరికట్టడంలో చాలావరకు విజయం సాధించారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లను పొందాలనుకుంటున్నాయని ఆయన విమర్శించారు.
“ఆర్జేడీ ప్రపంచవ్యాప్తంగా బిహార్‌ను అప్రతిష్టపాలు చేసింది. బిహార్‌ను ఆటవిక రాజ్యం రోజులకు తీసుకెళ్తారా? లేదా అభివృద్ధి మార్గంలో కొనసాగిస్తారా?. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆర్జేడీ బూటకపు హామీ ఇచ్చింది. నీతీశ్ 20 ఏళ్ల పాలనలో ఆయనపై ఎటువంటి అవినీతి ఆరోపణ రాలేదు. లాలూ కుటుంబం మొత్తం అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి” అని విమర్శించారు.
“మహాగఠ్ బంధన్ అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తామని తప్పుడు వాగ్దానం చేసింది. పార్లమెంటులో ఆమోదం పొందిన చట్టాన్ని వారు రద్దు చేయలేరు. బీజేపీ మత, కుల రాజకీయాలను పాల్పడదు. న్యాయమైన, స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తుంది. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చింది రాహుల్ గాంధీ కాదు, ప్రధాని మోదీ” అని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
బిహార్ లో మళ్లీ జంగిల్ రాజ్ రానివ్వం
కాగా, ఎన్డీఏ అరాచకాలను సహించదని, బిహార్‌లో జంగిల్ రాజ్ తిరిగి అధికారంలోకి రావడాన్ని అడ్డుకుంటుందని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తేల్చి చెప్పారు. సమగ్ర అభివృద్ధి కోసం ఎన్డీఏకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. బిహార్ ప్రజలకు నేరస్థులను ఆలింగనం చేసుకునే ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి పార్టీలు అవసరం లేదని స్పష్టం చేశారు. సివాన్ జిల్లాలోని రఘునాథ్ పుర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Stories
బీహార్ లో ప్రతిపక్షం గెలిస్తే పిఎఫ్ఐ కార్యకర్తలను జైల్లోనే ఉంచుతారా?
ఛత్తీస్‌గఢ్‌లో మరో 51 మంది నక్సలైట్లు లొంగుబాటు
రఫేల్ యుద్ధవిమానంలో విహరించిన రాష్ట్రపతి ముర్ము