ఇదిలా ఉండగా ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న దేవస్వం మాజీ పరిపాలన అధికారి బి.మురారి బాబు, 2019లో దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్న సమయంలో బంగారానికి బదులు రాగి అని నమోదు చేసినట్లు సిట్ గుర్తించింది. తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో సిట్ బృందం ఆయన్ను విచారించగా, ఉద్దేశపూర్వకంగా తాను అలా చేసినట్లు మురారి బాబు అంగీకరించాడు. దీంతో ఆయన్ను రన్నీ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు.
1998లో విగ్రహాలకు బంగారు పూత పూసినట్లు మురారి బాబుకు ముందే తెలుసునని దర్యాప్తు బృందం తమ నివేదికలో పేర్కొంది. అంతేకాదు మురారి బాబు బంగారు రేకులను అక్రమంగా రవాణా చేయడంలో ఉన్నికృష్ణన్ పొట్టికి సహాయం చేశాడని సిట్ భావిస్తోంది. బంగారు రేకులను రాగిగా నమోదు చేసి, దాదాపు రెండు కిలోల బంగారాన్ని కొట్టేయాలనే మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇది చేశారని సిట్ బృందం అనుమానిస్తోంది. అయితే చంగనస్సేరిలో ఉన్న తన నివాసంలో బుధవారం రాత్రి మురారిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యేక దర్యాప్తు బృందానికి బాధ్యత వహిస్తున్న ఏడీజీపీ హెచ్.వెంకటేష్ ఆయన్ను విచారించారు. 2019లో శబరిమల నుంచి బంగారు రేకుల అక్రమ రవాణాకు దోహదపడ్డారనే ఆరోపణలతో పాటు, ఇతర కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా దేవస్థానం డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న బి. మురారి బాబును ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఇటీవలే సస్పెండ్ చేసింది.

More Stories
అత్యంత వేగంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ఓలా, ఉబర్ సంస్థలకు పోటీగా కేంద్రం ‘భారత్ ట్యాక్సీ’
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు మూసివేతతో స్తంభించిన వాణిజ్యం