* ఎంపీడీవో కార్యాలయం ముందు బీజేపీ శ్రేణుల బైఠాయింపు!
దీపావళి పండుగ వేళ కాషాయ జెండా తొలగింపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామంలో దీపావళి రోజున గ్రామ కార్యదర్శి మహమ్మద్ అప్సన కాషాయ జెండాను తొలగించారనే ఆరోపణలతో బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున భగ్గుమన్నారు. ఈ ఘటనపై బిజెపి నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండల అధ్యక్షుడు మిర్యాల కార్ బాలాజీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కోనరావుపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.మత మనోభావాలను దెబ్బతీసే చర్యగా ఈ జెండా తొలగింపును బీజేపీ అభివర్ణించింది. పండుగ రోజున కావాలనే తమ జెండాను తొలగించి, ఉద్రిక్తత సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. నిరసన అనంతరం, బీజేపీ నాయకులు ఎంపీడీవో శంకర్ రెడ్డి, తాసిల్దార్ వరలక్ష్మిలను కలిసి, తమ నిరసన కారణాలను వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు.
కాషాయ జెండా తొలగింపునకు పాల్పడిన గ్రామ కార్యదర్శి మహమ్మద్ అప్సనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోనీ సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యదర్శి పై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరారు.

More Stories
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ బిజెపి నేతల ప్రచారం!
అప్పుల్లో అగ్రగామిగా తెలుగు రాష్ట్రాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు