
పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్థ జైషే-మొహమ్మద్ మహిళను ఉగ్రవాదులుగా మార్చేందుకు కొత్తగా ఆన్ లైన్ కోర్సును ప్రారంభించింది. దీనికి “తుఫత్-అల్-ముమినాత్” (జీహాదీ కోర్సు) అని పేరుపెట్టింది. అంతేకాదు దీని ఫీజును 500 పాకిస్థానీ రూపాయలుగా నిర్ణయించింది. గత నెలలో బహవల్పూర్లోని మర్కజ్ ఉస్మాన్ ఓ అలీలో జరిగిన బహిరంగ సమావేశంలో కనిపించిన మసూద్ అజార్ ఇప్పుడు తన ఉగ్రవాద కార్యకలాపాల కోసం విరాళాలు సేకరించే పనిని ముమ్మరం చేశాడని సమాచారం.
అందులో భాగంగానే మహిళల కోసం ఒక ఆన్లైన్ కోర్సు పెట్టి ఒక్కొక్కరి నుంచి 500 పాకిస్థానీ రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ పెంచిపోషిస్తున్న ‘జైషే-మొహమ్మద్’ గ్రూప్ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే ఈ ఉగ్రవాద సంస్థ ఇప్పుడు “జమాత్ – ఉల్-ముమినాత్” అనే మహిళా విభాగాన్ని సృష్టించింది.
అంతేకాదు తమ టెర్రర్ గ్రూప్నకు అవసరమైన నిధులు సేకరించేందుకు, నియామకాలు చేపట్టేందుకు, ముఖ్యంగా మహిళలను తమలో చేర్చుకుని ఉగ్ర శిక్షణ ఇచ్చేందుకు “తుఫత్-అల్-ముమినాత్” అనే ఆన్లైన్ శిక్షణా కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సులో చేరిన వారికి జైషే-మొహమ్మద్ గ్రూప్నకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాదాలు శిక్షణ ఇస్తారు. అందులో ప్రధానమైనవాళ్లు జైషే-మొహమ్మద్ వ్యవస్థాపకుడైన మసూద్ అజార్కు చెందిన బంధువులు, కమాండర్లు. వీరు మహిళలకు జీహాద్ గురించి, ఇస్లాం గురించి బోధిస్తారు.
శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆన్లైన్లో నియామకాలు చేపడతారు. ఈ నవంబర్ 8 నుంచే ఈ కోర్సు ప్రారంభం కానుంది అని సమాచారం. ప్రతిరోజూ 40 నిమిషాల పాటు ఉగ్ర పాఠాలు బోధిస్తారు. వీటిని అజార్ సిస్టర్స్ అయిన సదియా అజార్, సమైరా అజార్ బోధిస్తారు. వారు మహిళలు కచ్చితంగా ‘జమాత్-ఉల్-ముమినాత్’లో చేరాలని ప్రోత్సహిస్తారని తెలుస్తోంది.
మసూద్ అజార్ చెల్లెలు సదియా అజార్కు ఈ విషయంలో పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం తీవ్రవాదుల భార్యలు, పేద మహిళలను రిక్రూట్ చేసుకోవడానికి జైషే మహమ్మద్ తొలుత ప్రాధాన్యం ఇస్తున్నది. బహావల్‌పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోటిలీ, హరిపూర్ మదర్సాల్లోని మహిళలను ఉగ్రవాదం వైపు తీసుకొస్తున్నట్టు తెలిసింది. బహావల్‌పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోటిలీ, హరిపూర్ మదర్సాల్లోని మహిళలను ఉగ్రవాదం వైపు తీసుకొస్తున్నట్టు తెలిసింది.
More Stories
శ్రీలంకలో పట్టపగలే ప్రతిపక్ష నేత దారుణ హత్య
15-16 శాతానికి అమెరికా సుంకాలు తగ్గే అవకాశం!
పాక్ లో పురుడు పోసుకుంటున్న హమాస్!