
* తప్పిన పెద్ద హెలికాప్టర్ ప్రమాదం
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. బుధవారం ఉదయం పంబ నుంచి ఇరుముడితో ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాల ధరించి ఇరుముడితో 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకున్నారు. అక్కడ ఇరుముడి సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ముర్ము ఓ రికార్డు నెలకొల్పారు. శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి అధ్యక్షునిగా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో రెండు గంటల పాటూ బస చేయనున్నారు. అక్కడే రాష్ట్రపతికి ప్రత్యేకంగా ఆహారం వండి వడ్డించనున్నారు.
మధ్యాహ్నం 3:10 గంటలకు ముర్ము శబరిమల నుంచి బయల్దేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నిమిత్తం ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముర్ము ఓ రికార్డు నెలకొల్పారు. శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రెసిడెంట్‌గా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో రెండు గంటల పాటు బస చేశారు. అక్కడే రాష్ట్రపతికి ప్రత్యేకంగా ఆహారం వండి వడ్డించారు. మధ్యాహ్నం 3:10 గంటలకు ముర్ము శబరిమల నుంచి బయల్దేరి వెళ్తారు.
రాష్ట్రపతి పర్యటన నిమిత్తం ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆరు కాన్వాయ్‌లతో ద్రౌపది ముర్ము శబరిమలకు చేరుకున్నారు. రాష్ట్రపతి కోసం నిబంధనలు సడలించిన అధికారులు వాహనాల్లో శబరిమల చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు శబరిమలకు వెళ్తున్న క్రమంలో రాష్ట్రపతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం కేరళ వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా, హెలిప్యాడ్ ఉన్నట్టుండి కుంగిపోయింది. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. తిరువనంతపురం నుంచి బుధవారం ఉదయం పథనంథిట్టకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు.
అయితే హెలికాఫ్టర్ రాజీవ్ గాంధీ ఇందౌర్ స్టేడియంలో దిగుతుండగా కొత్తగా నిర్మించిన కాంక్రీట్ హెలిప్యాడ్ ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో హెలికాప్టర్ చక్రం అందులో ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన అక్కడ భద్రతా సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా హెలికాప్టర్ నుంచి దించారు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో పంబకు వెళ్లారు.
More Stories
లెఫ్టినంట్ కల్నల్‌గా నీరజ్ చోప్రా
లొంగుబాటుకు మావోయిస్టు అగ్రనేత హిడ్మా సిద్ధం?
కోడలితో మాజీ డీజీపీ అక్రమ సంబంధం.. కొడుకు హత్య?