
* పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
మూడు రోజుల కింద నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. ఈ నెల 17న రాత్రి ఓ చోరీ కేసులో నిందితుడు రియాజ్ ను పట్టుకొస్తుండగా అతడు కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడిచేసి పారిపోవడంతో, గాయాలకు గురై మృతి చెందారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినంకు నాలుగు రోజుల ముందుగా ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.
1959లో చైనాతో మన సరిహద్దులను కాపాడుకుంటూ ప్రాణాలను అర్పించిన 10 మంది పోలీసుల త్యాగాలను ఈ రోజు గుర్తుచేసుకుంటుంది. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్‌లో భారత భూభాగంలో జరిగిన అసమాన ఘర్షణలో 10 మంది సహసవంతులైన పోలీసులను చైనా సైన్యం మెరుపుదాడి చేసి చంపింది.
ఈ 10 మంది వీర పోలీసుల జ్ఞాపకార్థం, 1962లో జరిగిన డీజీపీల సమావేశం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21ని పోలీసు సంస్మరణ దినోత్సవంగా పాటించాలని నిర్ణయించారు. దేశంలో ఎక్కడైనా, ఎటువంటి ఉగ్రవాద సంఘటన జరిగినా ఏదోవిధంగా హైదరాబాద్ తో సంబంధం ఉండటాన్ని గమనిస్తున్నాము. ముఖ్యంగా ముస్లిం తీవ్రవాదులు పోలీసులను, ఇతర పౌరులను లక్ష్యంగా చేసుకొని హత్యాకాండకు దిగడాన్ని గమనిస్తున్నాము.
33 ఏళ్ళ క్రితం 1992 నవంబర్ 29న హైదరాబాద్‌లోని టోలిచౌకిలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ జి కృష్ణ ప్రసాద్ (1950-92)ను అతని గన్ మెన్ వెంకటేశ్వర్ రావుతో పాటు ఐఎస్ఐ ప్రాయోజిత ఉగ్రవాద మాడ్యూల్ కాల్చి చంపడం గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా పాతబస్తీలో తరచూ ఆ విధమైన దాడులు గురై పలువురు మృతి చెందుతున్నారు. పోలీసులనే కాకుండా విద్యుత్ బకాయిలు, మున్సిపల్ బకాయిలు వసూలు చేసేందుకు పాతబస్తీలో ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కూడా దాడులు జరగడం పరిపాటిగా మారింది. అదేవిధంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్, సిబ్బందిపై దాడులు సర్వసాధారణంగా మారాయి.
2020 ఏప్రిల్‌లో చాంద్రాయణగుట్టలో పోలీస్ కానిస్టేబుల్‌పై జరిగిన వాగ్వాదం తర్వాత దాడికి పాల్పడినందుకు తెలంగాణ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. కానిస్టేబుల్ పి ప్రవీణ్ కుమార్ తన విధుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ సర్వీస్ పాయింట్‌లో ఉండగా, ఇద్దరు యువకులు కానిస్టేబుల్‌పై దాడి చేసి అక్కడి నుండి పారిపోయారు. నిందితులను షేక్ మహ్మద్ అమీరుద్దీన్ (21) అనే మెకానిక్, షేక్ సైఫ్ మోహియుద్దీన్ (24) అనే ఎలక్ట్రీషియన్‌గా గుర్తించారు. వీరు చాంద్రాయణగుట్టలోని గుల్షన్ ఇక్బాల్ కాలనీ నివాసితులు.
27 ఏప్రిల్ 2016న పాతబస్తీలో ఫలక్‌నుమా సబ్-డివిజన్ పరిధిలోని గుల్షన్-ఎ-ఇక్బాల్ వద్ద విద్యుత్ బకాయిలు వసూలు చేస్తుండగా విద్యుత్ లైన్‌మెన్ అక్బర్ అలీ ఖాన్ పై దాడి జరగడంతో అతడిని తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. 30–31 జనవరి 2024 యాకుత్‌పురా ప్రాంతంలోని మాదన్నపేటలో ఒక లైన్‌మెన్ (రజినీష్ బాబు)పై దాడి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఎంఐఎం కార్యకర్త షఫత్ అలీను అరెస్టుచేశారు. మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
27 జనవరి 2025న ఆర్టీసీ కాళోజీలో మౌలా అలీ వద్ద పెండింగ్ బకాయిలపై విద్యుత్ సరఫరాను నిలిపి వేయడంతో జూనియర్ లైన్‌మెన్ కుర్రం సురేష్ పై భౌతికంగా దాడి చేసి, అతని బైక్‌ను ధ్వంసం చేశారు. 2018లో శాలిబండ వద్ద ఒక సంఘటనలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి జరిగింది. 19 జూన్ 2025న అత్తాపూర్ వద్ద ఒక మహిళా ఆర్టీసీ బస్సు కింద పది మృతి చెందడంతో ఒక సమూహం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది.
14 మే 2010న శాలిబండలో సున్నితమైన పాత నగర ప్రాంతంలో పికెట్ డ్యూటీలో ఉన్న యు రమేష్ అనే పోలీసు కానిస్టేబుల్ ను పట్టపగలు మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు.
More Stories
శ్రీరాముడే స్ఫూర్తిగా ఆపరేషన్ సింధూర్
జూబ్లీ హిల్స్ లో బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్
నవంబర్ 1లోగా ఒప్పందం.. లేదంటే 155 శాతం సుంకాలు