బ్రహ్మోస్ క్షీపనుల పరిధి ఇప్పుడు రెట్టింపు దూరం

బ్రహ్మోస్ క్షీపనుల పరిధి ఇప్పుడు రెట్టింపు దూరం
ఆపరేషన్ సిందూర్ లో బ్రహ్మోస్ క్షిపణుల పరాక్రమంతో మొత్తం ప్రపంచం నివ్వెరపోయింది.  నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై ఇవి విరుచుకు పాడినప్పుడు పాకిస్థాన్ గజగజ వణికిపోయింది. ఈ విషయం స్వయంగా పాక్ ప్రధాని హెషబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా గతంలో చెప్పారు. దాడి సమయంలో బ్రహ్మోస్ క్షిపణులకు అణు వార్ హెడ్ ఉందా లేదా అని తెలుసుకునేందుకు తమ వద్ద 30- 45 సెకన్ల సమయం మాత్రమే ఉందని,ఆ సమయంలో తడిచిపోయినంత పనైందన్న అర్థంలో గతంలో చెప్పుకొచ్చారు. 
బ్రహ్మోస్ మొదటి వెర్షన్‌కే పాక్, దానికి మద్దతిచ్చిన దేశాలు అల్లాడిపోతే ఇప్పుడు రెండో వెర్షన్ సిద్ధం అయింది. అంటే బ్రహ్మోస్ బలం ఇప్పుడు రెట్టింపు అయింది. 450 కిలోమీటర్ల రేంజ్ నుంచి 800 కిలోమీటర్లకు పెరిగింది.  బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి శబ్ద వేగం కంటే 2.8 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్లగలదు. సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా వీటిని దీనిని ప్రయోగించవచ్చు. ఇప్పుడు దీని రేంజ్‌ను 800 కిలోమీటర్లకు పెంచారు. 2027 నాటికి ఈ వెర్షన్ క్షిపణి అందుబాటులోకి వస్తుందని అంచనాలున్నాయి. 
 
కాగా, ఈ వెర్షన్‌కు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పని దాదాపు పూర్తైపోయింది. ఇంకా ఇనర్షల్‌ నేవిగేషన్‌ సిస్టమ్- ఎక్స్‌టర్నల్‌ గ్లోబల్‌ నేవిగేషన్‌ సిస్టమ్ కాంబినేషన్‌కు సంబంధించిన పరీక్షలు జరగాల్సి ఉన్నట్లు సమాచారం. ఈ పరీక్షలు కూడా విజయవంతమైతే  కొత్త తరం బ్రహ్మోస్ మిస్సైళ్లు 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.

ఆధునిక కాలంలో యుద్ధాలు జరిగే తీరు మారిపోయింది. శత్రువును చాలా దూరంగానే గుర్తించి కూల్చివేయడం ఇప్పటి వ్యూహంగా మారింది. 
ఇందులో ఉండే బియాండ్‌ విజువల్‌ రేంజ్ (బీవీఆర్‌ ) క్షిపణుల పాత్ర అత్యంత కీలకం. కాగా భారత్‌ వద్ద అస్త్ర మార్క్‌-2 పేరిట బీవీఆర్‌ క్షిపణి ఇప్పటికే ఉన్న క్షిపణి రేంజ్ 160 కిలోమీటర్లు. ప్రస్తుతం వాయుసేన ఈ సామర్థ్యాన్ని 280 కిలోమీటర్లకు పెంచే పనిలో ఉంది. అస్త్ర మార్క్‌-1 రేంజిని 100 కిలోమీటర్లకు పైగా పొడిగించనున్నాయి. మరో ఆరు నెలల్లో అస్త్ర మార్క్‌-2 ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. 
 
వాయుసేన 700 క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేస్తుండగా వీటిని సుఖోయ్‌-30 ఎంకెఐ, తేజస్‌లో అమర్చనున్నారు. ఇక ఘన ఇంధనం రామ్‌ జెట్‌ ఇంజిన్‌తో పనిచేసే అస్త్ర మార్క్‌-3 అభివృద్ధి జోరుగా జరుగుతోంది. దీని రేంజిని 350 కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రష్యా, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌ నుంచి బీవీఆర్‌ క్షిపణుల దిగుమతి తగ్గిపోతుంది.
 
భారత్ ఆపరేషన్‌ సిందూర్‌  సమయంలో పాక్‌లోని కీలక ప్రాంతాల్లో ఒకటైన రావల్పిండి సమీపంలో ఉన్న నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై మొదటి సారిబ్రహ్మస్‌ క్షిపణులతో విరుచుకుపడింది.   బ్రహ్మోస్ మొదటి దెబ్బ పాక్ రుచి చూసింది.