హెచ్‌-1 బి వీసా ఫీజ్ పెంపుపై యుఎస్ చాంబర్‌ దావా

హెచ్‌-1 బి వీసా ఫీజ్ పెంపుపై యుఎస్  చాంబర్‌ దావా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్‌-1 బి వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచడాన్ని సవాల్‌ చేస్తూ యుఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కోర్టులో దావా వేసింది. వీసాలకు సంబంధించిన ప్రస్తుత చట్టాలలో ఉన్న నిబంధనలను ట్రంప్‌ పరిపాలన అధిగమించినట్లు యుఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థ) పేర్కొంది. కాగా, హెచ్‌1-బి వీసా కొత్త రుసుము ఆ దేశీయ వలసవాద చట్టంలోని నిబంధల్ని అధిగమిస్తుంది.
ఇది చట్టవిరుద్ధం. వీసాలను ప్రాసెస్‌ చేయడంలో ప్రభుత్వం చేసే ఖర్చుల ఆధారంగా రుసుములు ఉండాలనే నిబంధన కూడా ట్రంప్‌ ప్రభుత్వం అధిగమించింది అని అమెరికా వ్యాపార సంస్థ వ్యాజ్యంలో పేర్కొంది.  ఈ మేరకు ఈ వ్యాపార సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈకేసును కొలంబియా జిల్లాకు చెందిన యుఎస్‌ జిల్లా కోర్టులో దాఖలు చేశారు.
కొత్త వీసా రుసుము అమెరికా యజమానులకు, ముఖ్యంగా స్టార్టప్‌లు, చిన్న- మధ్యతరహా వ్యాపారాలకు ఈ హెచ్‌1-బి ప్రోగ్రామ్‌ ఉపయోగించుకోవడం ఖర్చుతో కూడుకున్నది.  
అమెరికన్‌ వ్యాపారులు అమెరికాలో తమ వ్యాపారాలను పెంచుకోవడానికి, ప్రపంచ ప్రతిభను పొందడానికి ఈ వీసాలను ఉపయోగించుకుంటున్నాయి. అందుకే అమెరికన్‌ కాంగ్రెస్‌ హెచ్‌1-బి రుసుమును పెంచిందని యుఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌- చీఫ్‌ పాలసీ ఆఫీసర్‌ నీల్‌ బ్రాడ్లీ పేర్కొన్నారు.
అయితే అమెరికాలో ఎంతమంది హెచ్‌1-బి వీసాదారులు ఉన్నారనే దానిపై అమెరికా ప్రభుత్వం డేటాను అందించదు.  వీసా కోసం నమోదు చేసుకున్న వ్యక్తుల సంఖ్య, ఎంపికైన వారి సంఖ్యను మాత్రమే వెల్లడిస్తుంది. మెటా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్థాపించిన ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ క్రిమినల్‌ జస్టిస్‌ రిఫార్మ్‌ అడ్వకెసి బాడీ, ఇతర కంపెనీలు చెప్పిన వివరాల ప్రకారం అమెరికాలో 7.3 లక్షల హెచ్‌1-బి వీసా హోల్డర్లు ఉన్నారని చెబుతున్నాయి. 
 
2025 జనవరి నాటి లెక్కల ప్రకారం చూస్తే.. ఈ వీసాదారుల్లో దాదాపు 70 శాతం భారతీయులే ఉండడం గమనార్హం. యుఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యుఎస్‌సిఐఎస్‌) ప్రకారం ఈ ఏడాది జూన్‌ నాటికి అత్యధికంగా వీసాలను పొందిన కంపెనీగా అమెజాన్‌ టాప్‌లో నిలిచింది. ఈ కంపెనీ ఈ ఏడాది 10,044 హెచ్‌1-బి వీసాలను పొందింది. 
 
ఆ తర్వాత 5,505 వీసాలతో టాటా కన్సల్టెన్సీ కంపెనీ రెండవ స్థానంలో నిలిచింది. ఇన్ఫోసోసిస్‌ 2,004, విప్రో 1,523, మహీంద్రా అమెరికాస్‌ 951 హెచ్‌1-బి వీసాలు పొందాయి. దరఖాస్తు చేసుకున్న ఒక సంవత్సరం వరకూ కొత్త రుసుము వర్తిస్తుంది. అయితే ఈ గడువును కూడా అమెరికా ప్రభుత్వం పొడిగించే యోచనలో ఉంది.