పరకామణి చోరీ కేసులో టిటిడి ఈవోపై హైకోర్టు లో ఆగ్రహం

పరకామణి చోరీ కేసులో టిటిడి ఈవోపై హైకోర్టు లో ఆగ్రహం
* 27న హాజరు కావాలని ఈఓకు ఆదేశం లేదా రూ 20,000 జరిమానా
 
తిరుమల పరకామణి చోరీ కేసులో కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై టీటీడీ ఈవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ నెల 27న ఈవో న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. లేనిపక్షంలో రూ.20 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఘటనపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు టీటీడీ సమయం కోరడంతో  ఈ నెల 27కు వాయిదా వేసింది.

అంతకు ముందు ఏపీ సిఐడి సీజ్‌ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది.   అంతకు ముందు, తిరుమలలో పరకామణిలో జరిగిన అక్రమాలు, లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్‌ చేయాలని సెప్టెంబర్‌ 19న ఇచ్చిన ఆదేశాలను పోలీసు శాఖ, డీజీపీ పట్టించుకోకపోవడంపై హైకోర్టు పడింది. సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు, ఆధారాలను తారుమారు చేసేందుకు నిందితులకు పోలీసులు, డీజీపీ సహకరిస్తున్నారని ఆగ్రహించింది.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023లో తిరుమల పరకామణిలో చోరీ కేసు నమోదైంది. ఈ ఘటనపై 2023లోనే టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు అందింది. ఉద్యోగి రవికుమార్‌ పెద్దఎత్తున పరకామణిని కొల్లగొట్టారని అందులో పేర్కొన్నారు. దీనిపై అప్పటి టీటీడీ అధికారులు సమగ్ర దర్యాప్తు జరపకుండా లోకాయుక్తతో రాజీ చేయించారు. శ్రీనివాసులు అనే వ్యక్తి పిటిషన్‌ వేయడంతో హైకోర్టు విచారణకు స్వీకరించింది. 

 
మరోవైపు దీనికి సంబంధించి గతంలో ఉన్నత న్యాయస్థానం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో పరకామణిలో దస్త్రాలను సీఐడీ సీజ్‌ చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి చోరీ ఘటనలో 920 డాలర్లను టీటీడీ ఉద్యోగి రవికుమార్‌ చోరీ చేస్తూ పట్టుబడ్డారు. అనంతరం కేసు విచారణలో టీటీడీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించలేదంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది.
 
 ఆ తర్వాత లోక్‌అదాలత్‌లో రాజీ కుదుర్చుకుని అప్పటి పాలకవర్గం కేసు మూసివేసిందని ఆరోపణలు ఎదురయ్యాయి. లోక్‌అదాలత్‌లో రాజీ తర్వాత రూ.14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి రవికుమార్‌ విరాళంగా ఇచ్చారు. ఈ వరస పరిణామాల నెలకొన్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సీఐడీ మొదలుపెట్టడం గమనార్హం.

పరకామణిలో శ్రీవారి నగదు అపహరణ, కేసు పెట్టడం, లోక్‌అదాలత్‌లో రాజీపై రికార్డులన్నీ సీజ్‌ చేసి తదుపరి విచారణకు సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని సీఐడీ డీజీని ఆదేశించింది. అందులో భాగంగా సీజ్‌ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది.