
ఏపీలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పరిశ్రమలను బలోపేతం చేసి పౌరులను శక్తిమంతం చేసేలా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను స్వాభిమానం, సంస్కృతిల భూమిగా మోదీ అభివర్ణించారు. ఇది విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరణల కేంద్రం అని కొనియాడారు.
ఈ రోజు స్వచ్ఛ శక్తి నుంచి సంపూర్ణ శక్తి ఉత్పత్తి వరకు భారత్ ప్రతి రంగంలో కొత్త రికార్డులను సృష్టిస్తోందని చెబుతూ ఈ రోజు భారత్, ఆంధ్రప్రదేశ్‌ల వేగం, స్థాయిని ప్రపంచం చూస్తోందని గూగుల్ భారతదేశపు మొదటి ఏఐ హబ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించబోతోందని తెలిపారు. అలాగే ప్రపంచం భారత్‌ను 21వ శతాబ్దపు కొత్త తయారీ కేంద్రంగా చూస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వ దృష్టి అంతా పౌర కేంద్రిత అభివృద్ధిపైనే ఉందని స్పష్టం చేశారు.
నిరంతర సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలను మరింత సులభతరం చేస్తున్నామని వెల్లడించారు. సోమనాథుని భూమిగా ఉన్న గుజరాత్‌లో జన్మించానని బాబా విశ్వనాథుని కాశీలో సేవ చేస్తున్నానని, జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రంలో మల్లిఖార్జునస్వామి ఆశీర్వాదం పొందడం ఇవన్నీ తనకు లభించిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని మోదీ తెలిపారు.
కాగా. కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్’ కార్యక్రమం జరుపుకుని దాదాపు రూ. 13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు ఇది రెట్టింపు ఆనందాన్ని కలిగించిన రోజని చెబుతూ ఈ కీలక కార్యక్రమాలకు పునాది వేసినందుకు పీఎం నరేంద్ర మోదీకి ఎక్స్ వేదికగా సీఎం ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఒక కొత్త నవోదయం మొదలైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీ ప్రయాణం కర్నూలులోనే 72 ఏళ్ల క్రితం ప్రారంభమైందని గుర్తు చేశారు. అదే పవిత్ర భూమి నుంచి రాష్ట్ర అభివృద్ధి సాగుతోందని చెబుతూ ఇది కేవలం ప్రారంభోత్సవం కాదు దృఢ సంకల్ప ప్రకటన అని పేర్కొన్నారు.
More Stories
భారత్, ఏపీ వేగం, సామర్థ్యాన్ని యావత్ ప్రపంచం గమనిస్తోంది
శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీ
విశాఖ స్టీల్ కు ఏపీ ప్రభుత్వం రూ. 2,400 కోట్ల విద్యుత్ రాయితీ!