
“బీసీ మంత్రి అయిన మా అమ్మ కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. రెడ్లందరూ కలిసి మా కుటుంభాని టార్గెట్ చేశారు” అంటూ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు బుధవారం రాత్రి తమ ఇంటికి వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఆమె కుమార్తె సుస్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి సురేఖను, తండ్రి కొండా మురళిని వేధించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు.
“మా ఇంటికి మఫ్టీలో పోలీసులు వచ్చిండ్రు. ఎందుకొచ్చిండ్రని అడిగితే సుమంత్‌పై చాలా అభియోగాలున్నయని చెప్పిండ్రు. ఏమేం ఫిర్యాదులున్నాయో మాకు లిస్ట్ ఇవ్వండి అన్నం. ఆయన మా స్టాఫ్ కదా అని అడిగినం. వాళ్లు ఏం చెప్పకుండా వెళ్లిపోయిండ్రు. ప్రభుత్వంలో ఉండి కూడా ఇలాం టి పరిస్థితి ఫేస్ చేస్తున్నందుకు చాలా సిగ్గుగా ఉన్నది” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం సుష్మిత మీడియాతో మాట్లాడుతూ “దేవాదాయ శాఖలో ఒక టెండర్ పడింది. మంత్రి కొండా సురేఖకు తెలియకుండా మంత్రి పొంగులేటి తనకు కావాల్సిన వారికి ఇచ్చుకున్నరు. మావాళ్లు కూడా టెండర్ వేసిండ్రు. బిడ్ ఓపెన్ చేస్తే అది మా వాళ్లకు వచ్చింది. పొంగులేటి ఫోన్ చేసి టెండర్ విత్ డ్రా చేసుకోవాలని మా అమ్మను కోరిండ్రు. విత్‌డ్రా చేసుకోబోమని అమ్మ చెప్పారు. దీంతో ఆ టెండర్ రెవెన్యూ శాఖకు వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ టెండర్ రీకాల్ చేస్తున్నరు” అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
అయితే తన నియోజకవర్గం హుజూర్‌నగర్ పరిధిలో ఉన్న డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను సుమంత్ రివాల్వర్‌తో బెదిరించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారని, ఆ కారణంతోనే మాజీ ఓఎస్డీ అరెస్టుకు రంగం సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. “డెక్కన్ సిమెంట్‌తో ఇష్యూ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సుమంత్ ఎక్స్‌టార్షన్ చేశారంటున్నారు. రోహిన్‌రెడ్డికి తెలియాలి. రేవంత్‌రెడ్డికి తెలియాలి. రోహిన్‌రెడ్డిని మేం కలవలేదు. సీఎంవో ఆఫీసు నుంచి రోహిన్‌రెడ్డి వచ్చి సుమంత్‌కు కాల్ చేస్తే రోహిన్‌రెడ్డి ఆఫీసుకు సుమంత్ వెళ్లారు. కావాలంటే కెమెరాలు చెక్ చేసుకోవచ్చు” అని సుష్మిత సవాల్ చేశారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కారుకు చుక్కెదురు
`జై శ్రీరామ్’ నినాదంతో ముస్లిం పోలీస్ అధికారిణి!
హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసులో 24 గంటలు స్పీడ్ పోస్ట్