అహ్మదాబాద్‌ లో 2030 కామన్‌వెల్త్‌ గేమ్స్‌

అహ్మదాబాద్‌ లో 2030 కామన్‌వెల్త్‌ గేమ్స్‌
2030 కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు భారత్‌ ఎంపికైంది. అహ్మదాబాద్‌ వేదికగా 2030లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ జరగనున్నాయి. అహ్మదాబాద్‌ను వేదికగా కామన్‌వెల్త్‌ బోర్డు ప్రతిపాదించింది. నవంబర్‌ 26వ తేదీన సమావేశంలో తుదినిర్ణయం ప్రకటించనుంది.  కామన్వెల్త్‌ గేమ్స్‌కు రెండోసారి ఆతిథ్యమివ్వనుంది భారత్‌. గతంలో 2008లో డిల్లీ వేదికగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌ జరిగాయి.
2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించేందుకు భారత్ బృందం లండన్‌లోని కామన్వెల్త్ క్రీడల మూల్యాంకన కమిటీకి సెప్టెంబర్ 23న అధికారికంగా తన ప్రతిపాదనను సమర్పించింది.
ఆ బృందంలో గుజరాత్ క్రీడా మంత్రి హర్ష్ సంఘవి, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు డాక్టర్ పీటీ ఉష, భారత ప్రభుత్వం క్రీడా శాఖ కార్యదర్శి హరి రంజన్ రావు, గుజరాత్ ప్రభుత్వ క్రీడలు, యువజన సాంస్కృతిక కార్యకలాపాల విభాగం ప్రిన్సిపల్ కార్యదర్శి అశ్విని కుమార్, అమ్దావాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బంచా నిధి పాణి, కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిఈఓ రఘురామ్ అయ్యర్, సిజిఎ ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, సిజిఎఅధ్యక్షుడు అజయ్ నారంగ్ ఉన్నారు.

2030 ఎడిషన్ చరిత్రాత్మక ప్రాముఖ్యం కలిగి ఉంది. అప్పటికి కామన్వెల్త్ క్రీడలు మొదలైం 100 సంవత్సరాలు అవుతుంది. దీంతో భారత్లోని అహ్మదాబాద్‌ శతాబ్ది ఎడిషన్‌కు ఆతిథ్య నగరంగా పేర్కొంది. అంతర్జాతీయ ప్రమాణాల వేదికలు, బలమైన రవాణా వ్యవస్థలు, అధిక-నాణ్యత వసతిపై కేంద్రీకృతమై కాంపాక్ట్ గేమ్స్ ముద్రను అందిస్తుంది.