
కోల్డ్రిఫ్ సహా మూడు దగ్గు సిరప్లు నాసిరకమైనవిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) గుర్తించింది. వాటి విక్రయం మరియు వినియోగంపై అన్ని రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది. కల్తీ దగ్గు సిరప్ కోల్డ్రిఫ్ను సేవించడంతో మధ్యప్రదేశ్‌లో 22మంది చిన్నారులు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు రెడ్నెక్స్ ఫార్మాన్యూటికల్స్ తయారుచేసిన రెస్పిఫ్రెస్ టిఆర, షేప్ ఫార్మాకి చెందిన రీలైఫ్ను కలుషితమైన, నాసిరకమైన ఉత్పత్తులుగా గుర్తించినట్లు యుఎన్ తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ సిరప్‌ల్లో విషపూరిత డైథిలిన్ గ్లైకాల్ అనుమతించదగిన పరిమితి కంటే సుమారు 500 రెట్లు ఉన్నట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఒ) పేర్కొంది. దగ్గు సిరప్ మరణాల గురించి సిడిఎస్‌సిఒ డబ్ల్యుహెచ్ఒకి తెలిపింది. కలుషితమైన మెడిసిన్స్ ఏవీ కూడా ఎగుమతి చేయబడలేదని వెల్లడించింది. నమూనాలను సేకరించిన తర్వాత కోల్డ్రిఫ్ దగ్గు సిరప్‌లో విషపూరితమైన రసాయ పదార్థం డైథిలిన్ గ్లైకోల్ (డిఇజి) 8.6శాతం ఉన్నట్లు గుర్తించింది.
ఇది అనుమతించదగిన పరిమితి 0.1శాతం కంటే చాలా ఎక్కువ. అయితే నిషేధం విధించిన గుజరాత్‌లోని రెడ్నెక్స్ ఫార్మాన్యూటికల్స్ తయారు చేసిన రెస్పిప్రెష్ టిఆర్లో 1.342శాతం ఉందని, అనుమతించదగిన స్థాయి కంటే చాలా అధికంగా ఉన్నట్లు పేర్కొంది. జనవరి 2025లో తయారు చేయబడిన డిసెంబర్ 2026తో గడువు ముగియనున్న ఈ సిరప్‌ను పరిశోధనా ఫలితాలు వెలువడిన వెంటనే వెనక్కు తీసుకున్నట్లు సిఆర్డిఎస్ఒ పేర్కొంది. ఈ ఉత్తప్తి మొత్తాన్ని కేంద్రం నిలిపివేసినట్లు తెలిపింది.
మూడవ సిరప్ షేప్ ఫార్మాకిచెందిన రీలైఫ్లో కూడా డిఇజి 0.616శాతం ఉంది. దీని ఉత్పత్తిని వెంటనే వెనక్కి తీసుకుని ఉత్పత్తిని నిలిపివేశారు. షేప్ ఫార్మా అన్ని మెడిసిన్స్ ఉత్పత్తులను ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశించింది. కాగా, మధ్య ప్రదేశ్ లో ఈ దగ్గు సిరప్ రాస్తే డాక్టర్లకు కమీషన్ ఇచ్చినట్టు తేలింది. కమీషన్ కోసమే ఈ సిరప్‌ను పలువురు చిన్నపిల్లలకు ప్రిస్ర్కైబ్ చేసినట్టు మధ్యప్రదేశ్ డాక్టర్ ప్రవీణ్ సోని అంగీ కరించాడు. రూ.24.54 ధర ఉన్న ఆ సిరప్‌ను సిఫార్సు చేస్తే 10 % కమీషన్ వస్తుందని చెప్పాడు.
More Stories
ఝార్ఖండ్ లో 32 మంది మావోయిస్టుల మృతి, 266 మంది అరెస్ట్
ఛత్తీస్‌గఢ్‌లో 1040 మంది మావోయిస్టులు లొంగుబాటు
కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం