
దేశంలో తీసుకువచ్చిన మూడు కొత్త క్రిమినల్ లా చట్టాలు న్యాయ లక్ష్యంతో కూడుకున్నవే, అంతేకానీ శిక్షలే ప్రధాన ఉద్ధేశంతో ఉండేవి కావని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. భారతీయ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను 21వ శతాబ్ధంలో భారీ స్థాయిలో సంస్కరించే దిశలోనే ఈ మూడు చట్టాలు రూపొందాయని, అమలులోకి వచ్చాయని వివరించారు.
కేంద్ర హోం మంత్రి సోమవారం జైపూర్‌లోని కన్వెన్షన్ సెంటర్‌లో ఈ మూడు చట్టాల సమగ్ర స్వరూపం తెలిపే ఎగ్జిబిషన్‌ను ఆరంభించిన క్రమంలో మాట్లాడారు. నూతన చట్టాల పరిధిలో జరిగే కేసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్ పద్థతుల గురించి ఆయన వివరించారు. ఇంతకు ముందటి చట్టాల పరిధిలో కేసుల విచారణకు 25 నుంచి 30 ఏండ్ల వరకూ కాలం పట్టేదని గుర్తు చేశారు.
పైగా అనేక రకాల వేధింపులు, చివరికి కక్ష సాథింపు చర్యలు కూడా చోటుచేసుకునేవని, తీర్పులు లేకుండానే అనేకులు ఏళ్ల తరబడి జైలులో మగ్గిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు తీసుకువచ్చిన చట్టాలతో పరిస్థితి మారిందని, సరళీకృతంగా సత్వరంగా సంబందితులకు న్యాయం దక్కుతుందని వివరించారు.
ఈ కొత్త చట్టాలు పాత చట్టాలలోని అంశాలను పోలుస్తూ సశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఈ చట్టాలపై అవగావహన విషయంలో తొలి ప్రక్రియగా నిలిచింది. న్యాయవ్యవస్థలో ఉన్న పద్దతులతో జనం ఎక్కువగా ఈ వ్యవస్థ పట్ల నిట్టూర్పులకు గురికావడం జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయాలను సరిదిద్దడం ద్వారా అందరికి న్యాయం సకాలంలో అందేందుకు మార్గాలు ఏర్పడ్డాయని వివరించారు.
More Stories
హరియాణా డీజీపీని సెలవుపై పంపిన ప్రభుత్వం
కర్ణాటక కాంగ్రెస్ లో `ఆర్ఎస్ఎస్ నిషేధ’ దుమారం
రాహుల్ గాంధీకి సుప్రీంలో చుక్కెదురు