
తాను మంత్రిని కావాలని ఎప్పుడూ ప్రార్థించలేదని స్పష్టం చేశారు. పార్టీలో తానే చిన్నవాడినని, తన స్థానంలో రాజ్యసభ ఎంపీ సి. సదానందన్ మాస్టర్కు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన సూచించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 200కిపైగా చిత్రాల్లో నటించిన సురేశ్ గోపి 2016లో బీజేపీలో చేరారు. 2024 లోక్సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.
“ప్రజలు ఎన్నుకున్న మొదటి ఎంపీని కాబట్టి, పార్టీ నన్ను మంత్రిని చేయాలని భావించింది” అని ఆయన వివరించారు.ఈ సందర్భంగా, కొందరు తన మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని సురేశ్ గోపి ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గమైన త్రిశూర్ ప్రజలను ఉద్దేశించి తాను ‘ప్రజ’ అనే పదాన్ని వాడటాన్ని కొందరు విమర్శించారని ఆయన గుర్తుచేశారు.
“ఒకప్పుడు పారిశుద్ధ్య కార్మికులను వేరే పేరుతో పిలిచేవారు, ఇప్పుడు వారిని ‘శానిటేషన్ ఇంజనీర్లు’ అంటున్నారు. అలాగే నేను ‘ప్రజ’, ‘ప్రజాతంత్రం’ వంటి పదాలు వాడితే తప్పేంటి?” అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యర్థులు తన మాటలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే కణ్ణూర్కు చెందిన బీజేపీ సీనియర్ నేత సదానందన్ మాస్టర్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు.
More Stories
లింగ నిష్పత్తులు పడిపోవటంపై ఆందోళన
బీహార్ లో జేడీయూ- బీజేపీ చెరో 101 సీట్లు
విజయ్ ను ఎన్డీయేలో చేరమని పవన్ కళ్యాణ్ హితవు!