వచ్చే ఐదేళ్లలో భారత్ లో 40 లక్షల ఎఐ ఉద్యోగాలు!

వచ్చే ఐదేళ్లలో భారత్ లో 40 లక్షల ఎఐ ఉద్యోగాలు!
ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఎఐ, ఆటోమేషన్ జోరుతో నిన్న మొన్నటివరకు సేఫ్ అనుకున్న ఐటి ఉద్యోగాలు కాస్తా ఆవిరవుతున్నాయి. భారత్‌లో ఎఐ ఉద్యోగాలపై నీతి ఆయోగ్ అంచనాలను వెల్లడించింది. 2030 నాటికి అంటే వచ్చే ఐదేళ్లలోనే భారత్‌లో 40 లక్షల ఎఐ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని నీతి ఆయోగ్ ఆదివారం వెల్లడించింది. 
 
ముఖ్యంగా టెక్, కస్టమర్ ఎక్స్ పీరియన్స్ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలను ఎఐ సృష్టించబోతున్నట్లు తెలిపింది. నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రమణ్యం ఈ వివరాలు వెల్లడించారు. నాస్కామ్ బిసిజితో కలిసి ఈ నివేదిక తయారు చేసింది. 2035 నాటికి భారత్ ఎఐ రంగంలో గ్లోబల్ హబ్ గా మారబోతోందని ఈ నివేదికలో తెలిపారు.  ఎఐ దూకుడు కారణంగా క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్లు, లెవెల్ 1 సపోర్టింగ్ ఏజెంట్ల వంటి ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఈ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం వివిధ రంగాల్లో ఎఐ నైపుణ్యాల వృద్ధి, ఆవిష్కర ణలు జరగకపోతే ఉద్యోగాలకు ముప్పు తప్పదని హెచ్చరించింది. ఇవి జరిగితే మాత్రం జాతీయ స్ధాయిలో ఆయా ఉద్యోగులు ఆస్తులుగా మార తారని తెలిపింది.  ఎఐ దూకుడు కారణంగా టెక్నికల్, ఇంజనీరింగ్ విభాగాల్లో పెనుమార్పులు తథ్యమని చెబుతోంది. ఏఐ కారణంగా ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, రోబోటిక్స్ ఇంజనీర్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్ వంటి ఉద్యోగాల రాక పెరగనుందని నీతి ఆయోగ్ నివేదిక చెబుతోంది. 
 
వీటితో పాటు కొత్త ఉద్యోగాలైన ఎఐ ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఎఐ ఎథిక్స్ స్పెషలిస్ట్, ఎఐ ట్రైనర్స్, ఎఐ ప్రొడక్ట్ మేనేజర్స్, ఎఐ కస్టమర్ ఎక్స్ పీరియన్స్ స్పెషలిస్ట్, ఎఐ లిటరసీ ట్రైనర్స్, స్పెషలిస్ట్, ఎఐ హెల్త్ కేర్ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ వంటివి కూడా రాబోతున్నట్లు వెల్లడించింది.