
ఈ మేరకు 2017లో లాలూ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సీబీఐ.. తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ఆరోపణలతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏకీభవించింది. ఈ మేరకు లాలూ, ఆయన భార్య, కుమారుడిపై ఢిల్లీ కోర్టు తాజాగా అభియోగాలు మోపింది. దీంతో ఈ కుంభకోణం కేసులో వీరు విచారణను ఎదుర్కోనున్నారు.
అయితే, “ఇది సాధారణ కోర్టు ప్రక్రియ. ఈరోజు హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేయడంతో ఇక్కడికి వచ్చాం. ఈ కేసును న్యాయస్థానంలోనే పోరాడుతాం. కొన్ని రోజుల నుంచి మేము చెబుతూనే ఉన్నాం ఎన్నికల దగ్గరకు రాగానే కోర్టు కేసులు వస్తాయని. మేము కోర్టు తీర్పును గౌరవిస్తాం. వీటన్నింటిపైనా ఇప్పటికీ పోరాడుతున్నాం. అది కొనసాగిస్తాం” అని తేజస్వి యాదవ్ తెలిపారు.
“బిహార్ ప్రజలు చాలా తెలివైనవారు. వారికి ఏం జరుగుతుందో అంతా తెలుసు. రైల్వే వ్యవస్థకు దాదాపు రూ.90,000 కోట్ల ఆదాయాన్ని లాలూ తీసుకువచ్చారు. ఆయన రైల్వే మంత్రిగా చరిత్రలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. హార్వర్డ్, ఐఐఎమ్ విద్యార్థులు లాలూ నుంచి నేర్చుకునేందుకు వచ్చేవారు. ఆయనకు మేనేజ్మెంట్ గురు అనే పేరు ఉంది” అని గుర్తు చేశారు.
మరోవైపు ఐఆర్సీటీసీ స్కామ్లో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ స్పందిస్తూ “అవినీతి చేసినవారిపైనే అభియోగాలు నమోదు చేస్తారు. మొత్తం లాలూ కుటుంబమంతా ఐఆర్సీటీసీ స్కామ్లో పాలుపంచుకుంది. లాలూ కుటుంబం అవినీతి, కుంభకోణాలకు గుర్తింపు. ఈ స్కామ్ల వల్లే బిహార్ అభివృద్ధికి దూరంగా ఉంది. ఇకపై అవినీతి కుటుంబమైన లాలూను బిహార్ ప్రజలు అంగీకరించరు” అని స్పష్టం చేశారు.
More Stories
భారతదేశం ఆర్ఎస్ఎస్ తోనే ఎందుకు మెరుగ్గా ఉంది!
వచ్చే ఐదేళ్లలో భారత్ లో 40 లక్షల ఎఐ ఉద్యోగాలు!
బీహార్ లో జేడీయూ- బీజేపీ చెరో 101 సీట్లు