
రాజ్యాంగం కారణంగానే భారత్ ఐక్యంగా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పష్టం చేశారు. పొరుగు దేశాల్లో పౌర నిరసనలు, గందరగోళ పరిస్థితులు తలెత్తినప్పటికీ భారతదేశం బలంగా, ఐక్యంగా ఉండేలా రాజ్యాంగం హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. ఆదివారం మహారాష్ట్రలోని రత్నగిరిజిల్లాలోని మందన్‌గడ్ తాలూకాలోని ఒక కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ ”దేశం ఐక్యంగా ఉందని, అభివృద్ధి పథంలో పయనిస్తోంది. అంతర్గతంగా అత్యవసరపరిస్థితిని చూశాం. కానీ మనం బలంగా, ఐక్యంగా ఉన్నాము. దానికి కారణం డా.బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం. రాజ్యాంగం కారణంగానే అల్లర్లు, నిరసనల వంటి పరిస్థితులు నెలకొన్న పొరుగుదేశాల కన్నా భిన్నంగా ఉండగలిగాము” అని పేర్కొన్నారు.
రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ సంఘ సంస్కర్త డా.బి.ఆర్.అంబేద్కర్ స్వస్థలమైన అంబాదావే ప్రాంతంలో కోర్టు భవనం నిర్మించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత 22 ఏళ్లలో జడ్జీగా, తాను న్యాయవ్యవస్థ వికేంద్రీకరణకు మద్దతు ఇచ్చానని చెప్పారు. అనేక న్యాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తయ్యేలా చూసుకున్నానని తెలిపారు. కొల్హాపూర్ సర్క్యూట్ బెంచ్ (బాంబే హైకోర్టు), రెండేళ్లలో పూర్తయిన మందన్‌గడ్ కోర్టు భవనం తనకు పూర్తి సంతృప్తినిచ్చాయని చెప్పారు. కలసాకారమైందని, మందన్‌గడ్ కోర్టు భవన నిర్మాణ ప్రాజెక్టును వేగవంతం చేసినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి సిజెఐ కృతజ్ఞతలు తెలిపారు.
More Stories
లింగ నిష్పత్తులు పడిపోవటంపై ఆందోళన
బీహార్ లో జేడీయూ- బీజేపీ చెరో 101 సీట్లు
విజయ్ ను ఎన్డీయేలో చేరమని పవన్ కళ్యాణ్ హితవు!