
భారత్ అఫ్గానిస్థాన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్‌లో అప్గాన్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. భారత్ పర్యటనలో భాగంగా అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జమ్ముకశ్మీర్ గురించి చేసిన సూచనలకు సంబంధించి పాకిస్థాన్ సందేశాలను తెలియజేసినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.
“జమ్ముకశ్మీర్‌ను భారత్‌లో భాగంగా పేర్కొనడం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుంది. ఉగ్రవాదాన్ని నియంత్రించే బాధ్యతను పాకిస్థాన్‌పై మోపడం వల్ల ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కాపాడే బాధ్యత నుంచి అఫ్గన్ ఆఫ్ఘన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని తప్పించుకోవడం సాధ్యంకాదు” అంటూ పాకిస్తాన్ ఆక్రోశం వెళ్లగక్కింది.
“గత నాలుగు దశాబ్దాలుగా దాదాపు నలుగురు మిలియన్ల అఫ్గన్ పౌరులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్‌లో అనధికారికంగా నివసిస్తున్న అప్గాన్ పౌరులు తిరిగి తమ దేశానికి వెళ్లాలి. ఇతర అన్ని దేశాల మాదిరిగానే, తమ భూభాగంలో ఉన్న విదేశీ పౌరుల నివాసాన్ని నియంత్రించే హక్కు పాకిస్థాన్‌కు కూడా ఉంది” అని విదేశాంగ కార్యాలయం పేర్కొంది.
ఇక రెండు దేశాల మధ్య సామాజిక,ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు వాణిజ్యం, ఆర్థిక, అనుసంధాన సదుపాయాలను పాకిస్థాన్ విస్తరించిందని పేర్కొంది. అయితే, పాకిస్థాన్ తన పౌరుల భద్రతను కాపాడే బాధ్యత కలిగి ఉందని చెప్పింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు తన భూభాగాన్ని ఉపయోగించకుండా అప్గాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు విదేశాంగ కార్యాలయం నొక్కి చెప్పింది.
దాయాది దేశం పాకిస్థాన్‌తో ఘర్షణల వేళ అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ గురువారం భారత్ పర్యటనకు వచ్చారు. అక్టోబర్ 10న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అయ్యి, వివరణాత్మక చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఇరువురు మంత్రులు అభివృద్ధి సహకార ప్రాజెక్టులలో, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, ప్రజా మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాల్లో అఫ్గాన్‌కు భారత్ సహకారంపై మాట్లాడుకున్నారు. మరోవైపు, పర్యటకులపై పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు, అలాగే భారత ప్రజలు, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినందుకు అఫ్గాన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు జైశంకర్.
ఈ క్రమంలో భారత్‌పై ఉగ్రవాద దాడులు లేదా భారత వ్యతిరేక దాడులకు తమ భూభాగాన్ని ఎప్పటికీ అనుమతించబోమని ముత్తాఖీ స్పష్టం చేశారు. భారత్‌ను మిత్రదేశంగా భావిస్తామని, పరస్పర గౌరవం, వాణిజ్యం, ప్రజా సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదం పాకిస్థాన్ అంతర్గత సమస్య అని ముత్తాఖీ చేసిన వ్యాఖ్యలను ఇస్లామాబాద్ కూడా తోసిపుచ్చింది.
More Stories
ఆఫ్ఘన్ సరిహద్దులో 12 మంది పాక్ సైనికుల మృతి
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి