
తీవ్ర వాతావరణం కారణంగా ఇద్దరు ఆర్మీ కమాండోలు మరణించారు. అదృశ్యమైన ఆర్మీ జవాన్ల కోసం గత రెండు రోజులుగా వెతికారు. చివరకు మంచులో కప్పి ఉన్న ఆ సైనికుల మృతదేహాలను గుర్తించారు. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చినార్ కార్ప్స్ ఎలైట్ పారామిలిటరీ యూనిట్‌కు చెందిన లాన్స్ హవిల్దార్ పలాష్ ఘోష్, లాన్స్ నాయక్ సుజయ్ ఘోష్ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
కాగా, అక్టోబర్ 6 అర్ధరాత్రి దాటిన తర్వాత కోకెర్నాగ్‌లోని కిష్త్వార్ రేంజ్‌లో ఉగ్రవాదుల ఉనికి గురించి ఆర్మీకి సమాచారం అందింది. దీంతో అహ్లాన్ గడోల్ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా లాన్స్ హవిల్దార్ పలాష్ ఘోష్, లాన్స్ నాయక్ సుజయ్ ఘోష్ అదృశ్యమయ్యారు. మరోవైపు ఆ ఇద్దరు జవాన్ల కోసం రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల సెర్చింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి.
గురువారం ఒక సైనికుడి మృతదేహం కనిపించగా, శుక్రవారం మరొకరిది లభించింది. కాగా, తీవ్రమైన మంచు, చలి వాతావరణం కారణంగా ఆ ఇద్దరు జవాన్లు మరణినట్లు చినార్ కార్ప్స్ పేర్కొంది. సైనిక అధికారులతోపాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా అమరవీరులకు నివాళి అర్పించారు. ఆ తర్వాత జవాన్ల మృతదేహాలను వారి సొంతూర్లకు తరలించారు.
More Stories
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి
జార్ఖండ్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం