
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికను ఎన్నికల కమిషన్ ప్రకటించగానే ఎన్నికల నియమావళిని కాంగ్రెస్ ఉల్లంగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ కు బిజెపి ఎంపి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఓటర్ కార్డులను కాంగ్రెస్ నేతలు పంపిణీ చేయడంపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడీ కార్డులు పంచిపెట్టే దుకాణం పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ చేతుల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు.. కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎలా వెళ్లాయని ఆయన సూటిగా ఆయన ప్రశ్నించారు. బహిరంగంగా ఓటర్ కార్డులను పంచుతుంటే ఎన్నికల కమిషన్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఎందుకు మాట్లాడటం లేదని ఎంపీ రఘునందన్ విస్మయం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఓటర్ కార్డులను పంచుతున్న కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఎమ్యెల్యేగా పోటీకి ఎలా అర్హుడు అవుతాడని రఘునందన్ మండిపడ్డారు. నవీన్ యాదవ్ కు ఓటర్ ఐడీ కార్డులు ఎవరిచ్చారు? జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చారా? ఎన్నికల కమిషన్ ఇచ్చిందా? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) చేస్తామంటే గగ్గోలు పెడుతున్న మేధావులు ఇలాంటి వాటి మీదా స్పందించాలని ఆయన కోరారు. ఎస్ఐర్ చేస్తామంటే ఓట్ల చోరీ అంటున్నారని, ఇది ఐడీ కార్డుల చోరీనా? అని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్ ఐడీ కార్డులపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. జూబ్లీ హిల్స్ లో ఓటర్ ఐడీ కార్డుల పంపిణీపై వెంటనే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
అభ్యర్థుల ఎంపికకై ముగ్గురు సభ్యులతో బిజెపి కమిటీలు
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు