
ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థల నెట్‌వర్క్‌కు నిధులు వస్తున్న మార్గాలపై కెనడా ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా వేశాయి. కెనడాలోని సేవా సంస్థలకు వస్తున్న నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారన్న ఆరోపణలతో కెనడా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కెనడా ఆర్థికశాఖకు చెందిన మోర్సో నివేదిక ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని హమాస్, హెజ్బొల్లాతో పోల్చింది.
వేర్పాటువాదులు సేవా సంస్థల నిధులను ఉగ్ర కార్యకలాపాలకు వాడుతున్నారని ఆరోపించింది. స్థానిక రేడియో స్టేషన్ అధిపతి మణీందర్ ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ సహా పలువురు నాయకులకు కొన్నాళ్ల క్రితం లేఖ రాశారు. సామాజిక సేవకు వచ్చే విరాళాల దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. గత పాలకులు దీనిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఛారిటబుల్ సంస్థలకు వచ్చే నిధుల దుర్వినియోగంపై దృష్టి పెట్టనుంది. మరోవైపు భారత్-కెనడా భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకొన్నాయి. ఈ క్రమంలోనే కెనడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించింది.
More Stories
పాక్ ను మట్టికరిపించిన భారత మహిళల జట్టు
భారీ వర్షాలకు నేపాల్ లో 51 మంది, డార్జిలింగ్ లో 23 మంది మృతి
పీఓకేలో నిరసనలకు దిగివచ్చిన పాక్ ప్రభుత్వం