
బరేలీలో హింసాత్మక ఘర్షణలు జరిగిన వారం తర్వాత, పోలీసులు ‘ఐ లవ్ ముహమ్మద్’ ప్లకార్డులు తీసుకెళ్తున్న వ్యక్తులను ఆపిన తర్వాత, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (బరేలీ రేంజ్) అజయ్ కుమార్ సాహ్ని ఆ పోస్టర్లు ఎప్పుడూ సమస్య కాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా గుమికూడటమే తమ అభ్యంతరమని ఆయన తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని, నగరం ప్రశాంతంగా ఉందని సాహ్ని చెప్పారు.
పోలీసులు అన్ని పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. “మేము ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసాము. సిట్ లో ఇద్దరు డిప్యూటీ ఎస్పీలు, 10 మంది ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు. అల్లర్లు, ఫోర్జరీ అభియోగాలతో సహా బిఎన్ఎస్ సంబంధిత విభాగాల కింద నమోదు చేసిన10 ఎఫ్ఐఆర్ లను వారు దర్యాప్తు చేస్తున్నారు” అని సాహ్ని తెలిపారు.
‘ఐ లవ్ ముహమ్మద్’ హోర్డింగ్‌లు, పోస్టర్‌లను ప్రదర్శించే వ్యక్తులకు పోలీసులు అభ్యంతరం చెప్పడం గురించి అడిగినప్పుడు, సాహ్ని ఇలా చెప్పారు: “పోస్టర్లు ఎప్పుడూ సమస్య కాదు. వాస్తవానికి, గత శుక్రవారం సంఘటనకు ముందే, మేము దీని గురించి సమావేశ నిర్వాహకులకు తెలియజేసాము. అయితే, వారు పోలీసులపై రాళ్లు రువ్వడం ద్వారా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నప్పుడు, మేము చర్య తీసుకోవలసి వచ్చింది,” అని సాహ్ని వెల్లడించారు.
“తమ ఇళ్ళు, మసీదులు లేదా ఈద్గాల వద్ద ‘ఐ లవ్ ముహమ్మద్’ అని పోస్టర్లు వేయాలనుకునే వ్యక్తులు అలా చేయడానికి స్వేచ్ఛగా ఉన్నారు. ఇది వారి వ్యక్తిగత మతపరమైన విషయం. అయితే, ‘ఐ లవ్ ముహమ్మద్’ పేరుతో సమావేశాలు నిర్వహించడం, కవాతులు నిర్వహించడం, గందరగోళం సృష్టించడం అనుమతించబడదు,” అని డిఐజి స్పష్టం చేశారు.
“కాన్పూర్‌లో జరిగిన సంఘటన భిన్నంగా ఉంది. ప్రజలు దీనిని ఇతర నగరాల్లో పునరావృతం చేయకుండా ఉండాలి” అని ఆయన చెప్పారు. ఆగస్టులో, కాన్పూర్ పోలీసులు ‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్లు, లైట్‌బోర్డ్‌పై తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా ఉత్తరాఖండ్, గుజరాత్, కర్ణాటకలో నిరసనలకు దారితీసింది. ఈ లైట్‌బోర్డ్ కాన్పూర్‌లో ప్రవక్త మొహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగే వార్షిక బరావాఫత్ ఊరేగింపులో భాగం.
అయితే, కాన్పూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ బోర్డు ఏర్పాటుపై కాదని, మతపరమైన పోస్టర్లను చింపివేయడంపై ఉందని ఆయన చెప్పారు. బరేలీ నగరంలో పోలీసులు అలాంటి పోస్టర్లను తొలగించారా? అని అడిగినప్పుడు, “ఈ సమాచారం తప్పు” అని సాహ్ని బదులిచ్చారు. సెప్టెంబర్ 26న ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ (ఐఎంసి) చీఫ్ మౌలానా తౌకీర్ ఖాన్, ఇతరులు ఒక సమావేశానికి పిలుపునిచ్చారని సాహ్ని గుర్తు చేశారు.
“భద్రతా సంస్థలు అవాంతరాలు జరిగే అవకాశం ఉన్నందున, పెద్ద సమావేశాలను నివారించాలని, ఎటువంటి కవాతులను నిర్వహించకుండా ఉండాలని వారికి ఇప్పటికే సూచించము. కొనసాగుతున్న నవరాత్రి పండుగ గురించి మేము వారికి తెలియజేసాము. దుకాణాలు తెరిచి ఉన్నాయి. రద్దీగా ఉన్నాయి. మేము పదేపదే అభ్యర్థనలు, విజ్ఞప్తి చేసినప్పటికీ, వారు సమావేశమై అశాంతిని ప్రేరేపించడానికి ప్రయత్నించారు” అని సాహ్ని చెప్పారు.
ఇప్పటివరకు, నిరసనలలో వారి పాత్రపై తౌకీర్‌తో సహా మొత్తం 84 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ శుక్రవారం ప్రార్థనలకు ముందు, లక్నోలోని హోం కార్యదర్శి గౌరవ్ దయాల్ గురువారం నుండి శనివారం వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
More Stories
ఆత్మపరిశీలన, పునఃసమర్పణకు అవకాశంగా ఆర్ఎస్ఎస్ వందేళ్లు
ఛత్ పండుగ తర్వాతే బిహార్ ఎన్నికలు
‘సామాజిక భద్రతలో విశిష్ట కృషి’కి ఐఎస్ఎస్ఏ పురస్కారం-2025